పరిగి, నవంబర్ 1: తొమ్మిదిన్నర సంవత్సరాల బీఆర్ఎస్ పాలన ప్రగతికి కేరాఫ్‌గా నిలిచిందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి తెలిపారు. మరింత అభివృద్ధి జరగాలంటే మళ్లీ సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కావాలని ప్రజలు ముక్తకంఠంతో కోరుకుంటున్నారని చెప్పారు. బుధవారం పరిగి పట్టణంలోని 2, 3 వార్డుల్లో ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగుతున్నదన్నారు. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో మొదటి విడతలో రూ.15కోట్లు, రెండవ విడతలో రూ.25కోట్లు పట్టణాభివృద్ధికి మంజూరు చేశారని, మొదటి విడత ననులు పూర్తి కావచ్చాయని, రెండవ విడత పనులకు టెండర్లు పిలిచారని, సాధ్యమైనంత త్వరగా పనులు ప్రారంభం కానున్నాయని వివరిం చారు. మరోసారి తనను గెలిపించి బీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా మరింత అభివృద్ధి చేసేందుకు అవకాశం ఇవ్వాలని ఆయన ప్రజలను కోరారు. ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి చేపట్టిన ఇంటింటికీ ప్రచారానికి అపూర్వ ఆదరణ లభించింది. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, ఎంపీపీ కరణం అరవిందరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్, మాజీ జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు మీర్ మహమూద్‌అలీ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆంజనేయులు, సీనియర్ నాయకుడు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ భాస్కర్, కౌన్సిలర్లు అర్చన, వేముల కిరణ్, మునీర్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. అలాగే పరిగి నియోజకవర్గంలో బీఆర్ఎస్ జెండా ఎగరవే యడం ఖాయమని ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి సతీమణి ప్రతిమారెడ్డి పేర్కొన్నా రు. బుధవారం పరిగి పట్టణంలోని 5వ వార్డు పరిధి లో ప్రతిమారెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రాకేశ్, మంజుల, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు
దోమ: బూత్ స్థాయి కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి, జడ్పీటీసీ నాగిరెడ్డి అన్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించి కారు గుర్తుకు ఓటు వేసే విధంగా కృషి చేయాలన్నారు. మండల పరిధిలోని తిమ్మాయిపల్లి గ్రామ సమీపంలోని ఎస్జీ గార్డెన్లో బుధవారం పార్టీ బూత్ స్థాయి కార్యకర్తల మండల సమావేశాన్ని పార్టీ మండల అధ్యక్షుడు గోపాల్‌గౌడ్ ఆధ్వర్యం లో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి బూత్ స్థాయి కార్యకర్త వంద మంది ఓటర్ల బాధ్యతను తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో వైస్ ఎంపీపీ మల్లే శం, పీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్ లక్ష్మయ్య ముదిరాజ్, పార్టీ మండల అధ్యక్షుడు గోపాల్‌గౌడ్, సర్పంచ్ల సంఘం మండల అధ్య క్షుడు రాజిరెడ్డి, కో ఆప్షన్ ఖాజాపాషా, మాజీ ఎంపీపీ రాజగోపాలాచారి, నాయకు లు మచ్చేందర్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, కొండారెడ్డి, హన్మంతు, శ్రీనివాస్‌రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇదిలావుండగా కారు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలి పించాలని ఆయన సతీమణి ప్రతిమారెడ్డి అన్నారు. బుధవారం దోమ మండల పరిధిలోని దాదాపూర్ గ్రామంలో ఆమె ప్రచారం నిర్వహించారు.