మహబూబ్‌నగర్, (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/అచ్చంపేట, ఫిబ్రవరి 27 : కాంగ్రెస్ ప్రభుత్వం ఆదరాబాదరగా ఎస్ఎల్బీసీ టన్నెల్ చేపట్టడంతోనే కుప్పకూలిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ధ్వజమెత్తారు. సొరంగంలో 8 మంది కార్మికులు చిక్కుకొని ఆరు రోజులై నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని విమర్శించా రు. గురువారం దోమలపెంట సమీపంలోని ఎస్ఎల్బీసీ టన్నెల్‌ను బీఆర్ఎస్ ప్రతినిధులతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఓ పక్క ఎస్ఎల్బీసీ సొరంగంలో ప్రమాదం చోటు చేసుకుంటే.. మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డి ఎలక్షన్ ప్రచారంలో బి జీగా ఉన్నారని చురకలంటించారు. ముఖ్యమంత్రి రాకపోవడంతో స హాయక చర్యల్లో ఒక్క డైరెక్షన్ సక్రమంగా లేదని విమర్శించారు. మంత్రులేమో పొద్దున్నే వస్తారు.. సాయంత్రానికి వెళ్తున్నారు.. ఘటన జరిగి ఇన్ని రోజులై కార్మికులు చిక్కుకున్నా.. వారిని సురక్షితంగా తీసుకురావాలన్న చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి ఉందా..? అని ఆయన ప్రశ్నించారు. టన్నెల్లో కన్వేయర్ బెల్టు పనిచేస్తలేదు.. రిపేర్ చేయడానికి టైం పడ్తుందంట.. చెప్పేటోళ్లు ఎవరూ లేరు.. టీబీఎంపై రాళ్లు పడి.. డీబ్రీజ్తో చెల్లాచెదరైంది.. అది కట్ చేస్తేనే లోపలి బురద బయటకు వచ్చే అవకాశం లేదన్నారు. త్వ రగా నిర్ణయం తీసుకొని మరింత త్వరగా డీవాటరింగ్ చే యాలన్నారు.
కన్వేయర్ బెల్ట్ గురించి ఎన్డీఆర్ఎఫ్, ఇతర బృందాలతో, కంపెనీ ప్రతినిధులతో మాట్లాడినమన్నారు. వారు చెప్పే మాటలకు.. మంత్రులుచెప్పే జోలికి పొంతన లేదని విమర్శించారు. టన్నెల్లోకి వెళ్లి పరిశీలిస్తామంటే మ మ్మల్ని అడ్డుకున్నారన్నారు. మంత్రి ఉత్తమ్ అంటుండు.. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఈ ప్రాజెక్టు కూలిపోయిందంటుండు.. ప్రస్తుతం జరిగిన ప్రమాదానికి.. నాటి ప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉందా.. అని ప్రశ్నించారు. రైల్వే టీం ఉంది.. అక్కడ సింగరేణి టీం ఉంది.. ఎన్డీఆర్ఎఫ్ ఉంది.. ఆర్మీ, నేవీ, ర్యాట్ మైనర్స్ టీం మొత్తంగా చూస్తా ఉంటే అక్కడ బృందాల మధ్య సమన్వయం సాధించడంలో ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిందని విమర్శించారు. నాటి కాంగ్రెస్ హయాంలో ఈ ప్రాజెక్టుకి రూ.3,300 కోట్లు కేటాయిస్తే.. కేసీఆర్ ప్రభుత్వంలో రూ.3,900 కోట్లు కేటాయించామని, ఎక్కువగా.. రూ.6 00 కోట్లు కేటాయించామన్నారు. మంత్రి జూపల్లి మేము 5 కి.మీ. చేశామని చెబుతుండు.. 12 కి.మీ. పని చేస్తే ఆయన మా ప్రభుత్వంలో మంత్రిగా ఉండి నాతోపాటు ఇక్కడికి వచ్చి పనులు చూసి సమీక్ష నిర్వహించారు.. ఇప్పుడు మాట మార్చిండు.. అని దుయ్యబట్టారు. ఇప్పటికైనా సమన్వయంతో సహాయక చర్యలుచేపట్టాలని సూచించారు. నిపుణుల సలహాలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఆయనవెంట మాజీ మం త్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కోటిరెడ్డి, నవీన్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే విజయుడు, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్మార్, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, కంచర్ల రాంభూపాల్‌రెడ్డి, మాజీ కార్పొరేషన్ల చైర్పర్సన్ రజిని సాయిచంద్, చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, కురువ విజయ్ కుమార్, నాయకులు ఉన్నారు.
ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనలో చిక్కుకున్న వారికి కాపాడేందుకు వచ్చిన రెస్క్యూ బృందాలకు ఆరు రోజుల వరకు డైరెక్షన్ ఇవ్వకుండా ఎవరు ఏ పని చేయాలి చెప్పకుండా మంత్రులు టూరిజం స్పాట్‌కు వచ్చినట్లుగా హెలికాప్టర్లో ఉదయం వచ్చి సాయంత్రం తిరిగి వెళ్తున్నారని, సొంత జిల్లా అని చెప్పుకునే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఎనిమిది మంది ప్రాణాలు ముఖ్యమా..? ఎన్నికల ప్ర చారం, ఢిల్లీ పర్యటనలు ముఖ్యమా..? అంటూ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రశ్నించారు. గురువారం ఆయన మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీలు నవీన్‌రెడ్డి, కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే లు గువ్వల బాలరాజు, మర్రి జనార్దన్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి, కంచర్ల భూపాల్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రాష్ట్ర గిడ్డంగుల మాజీ చైర్పర్సన్ రజనీసాయిచంద్తో కలిసి బీఆర్ఎస్ బృందం దోమలపెంట లో ఎస్ఎల్బీసీ సోరంగంలో చోటుచేసుకున్న ప్రమాదస్థలిని పరిశీలించి, కార్మికులు, బాధిత కుటుంబాలను కలిసి మనోధైర్యం కల్పించి, ప్రభుత్వానికి సలహాలు సూచనలు చేసేందుకు వచ్చారు.
ఎస్ఎల్బీసీ టన్నెల్ సందర్శన అనంతరం తిరిగి వెళ్తుండగా పక్కనే షెడ్డులో నివాసం ఉంటున్న కార్మికుల వద్దకు వెళ్లారు. సొరంగంలో చిక్కుకున్న వారి బంధువులను పరామర్శించారు. ఘటనలో త్రుటిలో తప్పించుకున్న వారితో మా ట్లాడారు. ప్రమాదం జరిగిన ఒకరోజు ముందు సొ రంగంలోకి వెళ్లిన మాకు పైనుంచి మట్టి, రాళ్లు కిందపడుతూ భారీగా నీటి ఊట వచ్చిందన్నారు. ఈ సమయంలో పనులు చేస్తే ప్రమాదమని తెలిసి కూడా మమ్మల్ని లోపలికి పం పించారు. సుమారు 50మందిని 12 కిలోమీటర్ల దూరం పంపించి అక్కడి నుంచి రెండు కిలోమీటర్లు నడిపించి టీబీఎన్ మెషిన్లు ఆన్ చేశారు. కొద్దిసేపట్లోనే మి షన్‌పై రాళ్లు, మట్టి పడి నీటి ఊట బయటికి వచ్చింది. మి షన్ 80మీటర్లు వెనక్కి వచ్చింది. దీంతో తామంతా భయపడి పారిపోయాం. కొంతమంది తొక్కిసలాటలో కిందపడి అక్కడే చిక్కుకున్నారు. మిషన్ ఆపరేటర్లు, ఇంజినీర్లు కూడా ఈ ఘటనలో లోపలే ఉండిపోయారని, తాము మా త్రం ప్రాణాలతో బయటపడినట్లు కన్నీరు మున్నీరయ్యా రు. మూడు నెలలుగా కంపెనీ జీతాలు చెల్లించడం లే దని, పస్తులుంటున్నామని, ఇక ఇక్కడి నుంచి వెళ్లిపోతున్నామని హరీశ్‌రావు బృందానికి వివరించారు. ఇందుకు హరీశ్‌రావు స్పందించి లేబర్ కమిషనర్‌తో మాట్లాడి మీ డబ్బులు మీకు అప్పగించడంతోపాటు కం పెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకునేలా చూస్తానని హా మీ ఇచ్చారు.
ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటన జరగడం దురదృష్టకరమని మాజీ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. టన్నెల్లో ఇరుక్కుపోయిన కార్మికులు, ఇంజినీర్లు క్షేమంగా రావాలని అందరికీ ఉందన్నారు. ఏదైనా ప్రాజెక్టు రూపకల్పన చేసేముందు సత్వర ఫలితాలు ప్రజలకు అందించాలనే తపన పాలకులకు ఉండాలని, ఎస్ఎల్బీసీ రూపకల్పన జరగడమే లోపభూయిష్టంగా జరిగిందని ఉద్యమ సమయంలో కేసీఆర్, హరీశ్‌రావు అనేక సార్లు చెప్పారని అన్నారు. సంఘటన జరిగినప్పుడు చెప్పడం కాదని శాసససభలో సీఎంగా ఉన్న కేసీఆర్ చెప్పారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టుతో సమానంగా మొదలుపెట్టిన ఏపీకి చెందిన పోతిరెడ్డిపాడును ఆగమేఘాల మీద పూర్తి చేస్తారని, ఎస్ఎల్బీసీ ఎన్నటికీ ఒడవని ముచ్చటగా ఉండాలనే వివక్షను ఆనాడే ఎత్తిచూపామని అన్నారు. ప్రభుత్వంలో వచ్చాక దీనిని ఏమి చేయాలని ఆలోచన చేసినప్పుడు ఆనాడు ఈపీసీ విధానం తెచ్చారని జీవో 147 వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు రూ.2,811కోట్లతో ఈపీసీ కింద చేపట్టాలని నిర్ణయించారన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు హరీశ్‌రావు నేతృత్వంతో దాదాపు 64కిలో మీటర్ల వరకు టన్నెల్‌ను 11.5 డయమీటర్తో టన్నెల్‌ను మూడేండ్లలోపు పూర్తి చేశామని అన్నారు. ఈ ప్రభుత్వం 15మాసాలుగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు నీళ్లు ఇవ్వాలన్న చిత్తశుద్ధి లేకుండా పనిచేస్తుందన్నారు. ఫలితాలు ఇవ్వడానికి ప్రాజెక్టు సిద్ధ్దంగా ఉందన్నారు. ఈ ఘటనను రాజకీయం చేయదల్చుకోలేదన్నారు. రెండు కొండలమధ్య ప్రమాదం జరిగిన స్థలం కొన్ని దశాబ్దాలుగా గ్యాప్ ఉండడం వల్ల మట్టి, రాళ్లు పేరుకుపోయి లూజ్‌గా ఉండడం వల్ల అక్కడ డ్రిల్లింగ్ జరుగడం వల్ల పడిపోయిందని నిపుణులు చెబుతున్నారన్నారు. ప్రాజెక్టు పునః ప్రారంభానికి ముందు సాంకేతికంగా ముందు జాగ్రత్తలు తీసుకొని పనులు మొదలుపెట్టాలని సూచించారు.
ఎస్ఎల్బీసీ పనులు చేపట్టేముందు జియాలజికల్ సర్వే నివేదిక ఆధారంగా పనులు మొదలు పెట్టకుండా ఓ నేత ఒత్తిడి వల్ల ఆదర బాదరగా టన్నెల్ పనులు మొదలు పెట్టారని మాజీ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి అన్నారు. ప్రమాదం జరిగి ఆరు రోజులైనా ఎలాంటి పురోగతి లేదని, మంత్రులు మాత్రం ఫొటోలకు ఫోజులు ఇవ్వడం తప్పా వారు చేసిందేమీలేదన్నారు. మంత్రులు గాలిలో తిరుగుతూ గాలి మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. సీఎం సొంతజిల్లాలో ఇంతపెద్ద ఘటన జరిగి ఆరురోజులైనా ఆయన రావడానికి తీరికలేదా? అంటూ ప్రశ్నించారు. లోపల చిక్కుకున్న కార్మికలు, ఇంజినీర్ల ప్రాణాలను కాపాడాలనే చిత్తశుద్ది ప్రభుత్వానికి కనిపించడం లేదన్నారు. ఆరురోజుల తర్వాత తట్ట మట్టి బయటకు తీశారన్నారు.