మక్తల్ టౌన్, ఏప్రిల్ 25 : నియోజకవర్గ ప్రజలే తన కుటుంబసభ్యులని మ క్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి తె లిపారు. తన జీవితం ప్రజాసేవకే అం కితం చేస్తానన్నారు. సీఎం కేసీఆర్ అడుగుజాడల్లోనే కొనసాగుతున్నానన్నారు. మండలంలోని ఉప్పర్‌పల్లి స్టేజీ వద్ద గ్రా మ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ జెండాను మంగళవారం ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అనంతరం మ క్తల్ మినీ ట్యాంక్‌బండ్ వద్ద నుంచి ఆ యా మండలాల కార్యకర్తలతో కలిసి ద్వారకా గార్డెన్లో ఏర్పాటు చేసిన నియోజకవర్గస్థాయి ప్రతినిధుల సభ వరకు బైక్‌ర్యాలీ నిర్వహించారు. అనంతరం పలు అంశాలపై తీర్మానాలు చేశారు. ఈ సం దర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తండ్రి, తమ్ముడి ని కోల్పోయానని, నియోజకవర్గ ప్రజలనే కుటుంబసభ్యులుగా భావించి సేవ చేస్తానన్నారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇ వ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇల్లు లేకుండా ఖాళీజాగా ఉన్న వారికి గృహలక్ష్మి పథకం కింద ఇల్లు నిర్మించుకునేందుకు త్వరలోనే రూ.3 లక్షలు అందజేస్తామనారు. గతంలో అమరచింతలో ప్రభుత్వం ఇచ్చిన ఇండ్లను లబ్ధిదారులకు చేరకుండా సి మెంట్, డబ్బులు దోచుకొని.. బం డారం బయటపడుతుందని హౌసిం గ్ కార్యాలయానికే నిప్పుపెట్టారని గుర్తు చేశారు. మక్తల్‌లో రూ.34 కో ట్లతో 150 పడకల దవాఖాన నిర్మాణానికి మంత్రి హరీశ్‌రావు చేతులమీ దుగా త్వరలోనే భూమి పూజ చేస్తా మన్నారు. కొత్త మండలాల్లో భవనా ల ఏర్పాటుకు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానన్నా రు. బీజేపీ సర్కార్‌కు నైతిక విలువలు లేవన్నారు. కేంద్రం నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంట్‌కు అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీపీసీ మాజీ చైర్మన్ దేవరి మల్లప్ప, రైతుబంధు సమితి సభ్యురాలు, ఎమ్మెల్యే సతీమణి చిట్టెం సుచరితారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్లు గాయ త్రి, మంగమ్మ, నాయకుడు శ్రీనివాస్‌గుప్త, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు మహిపాల్‌రెడ్డి, రవికుమార్‌యాదవ్, రమేశ్ ముదిరాజ్, ఎల్లారెడ్డి, లక్ష్మారెడ్డి, జెడ్పీటీసీలు, కార్యకర్తలు, నాయకులు ఉన్నారు.