వనపర్తి, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ) : ఐదు రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా ని లిచిన క్రమంలో శనివా రం యథావిధిగా విడుదల పునఃప్రారంభమైం ది. భగీరథ పైపులైన్‌పై వాల్వ్‌ను ఏర్పాటు చేసే క్రమంలో నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో గ్రామాల్లో తాగునీటి ఎ ద్దడి ఏర్పడింది.
దీనిపై ‘నమస్తే తెలంగాణ’లో ‘భగీరథ నీళ్లు బంద్’ కథనం ప్రచురితమైంది. సమస్యపై మిషన్ భగీరథ ఎస్ఈ వెంకటరమణ స్పందించారు. వాల్వ్ పనుల వల్ల కొంత అంతరాయం ఏర్పడిందని, శుక్రవారం పొద్దుపోయినా పనులను పూర్తి చేసినట్లు వెల్లడించారు. ఈ వాల్వ్‌ల ఏర్పాటుతో భవిష్యత్‌లో జిల్లాలో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడదన్నారు. అలాగే అనారోగ్య సమస్యలు తలెత్తకుండా క్లోరినేషన్, బ్లీచింగ్ పౌడర్ చల్లడం వంటివి చేపడుతున్నామన్నారు.
వనపర్తి టౌన్, ఆగస్టు 24 : మున్సిపల్ సిబ్బంది, పాలకవర్గం నిర్లక్ష్యంతోనే తాగునీటి ఎద్దడి ఏర్పడిందని మున్సిపల్ మాజీ చైర్మన్ శ్రీధర్, మాజీ కౌన్సిలర్ తిరుమల్ అన్నారు. పోచగుట్ట వాటర్ ట్యాంక్ వద్ద చే పడుతున్న మరమ్మతులను వారు పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ పదేండ్ల బీఆర్ఎస్ పాలన లో నీటి కొరత ఏర్పడిన దాఖలాలు లేవన్నారు. నెల కిందటే వాల్వ్, పైపులైన్ మరమ్మతులు చేయాల్సి ఉ న్నా నిర్లక్ష్యం చేయడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆరోపించారు. స్థానికంగా వాల్వ్, షెటర్లు పనిచేస్తున్నాయో? లేదో తెలుసుకోవడంలో అధికారుల దృష్టికి నెల కిందటే తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు.