మక్తల్, మార్చి 21 : రాష్ట్రంలో మైనార్టీ సంక్షేమానికి పెద్దపీట వేసి మైనార్టీల అభివృద్ధికి పాటుపడింది కేసీఆర్ సరారేనని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నా రు. పవిత్రరంజాన్ మాసంలో భాగంగా శుక్రవారం బీఆర్ఎస్ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్ ఇర్ఫాన్ అన్వర్ హుస్సేన్ ఇచ్చిన ఇఫ్తార్ విందుకు మాజీ ఎమ్మెల్యే చిట్టెం ముఖ్యఅతిథిగా హాజరయ్యా రు. ఈ సందర్భంగా మసీదులో ముస్లిం పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం ముస్లింలకు పండు తినిపించి రోజా విడిపించారు.
ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ కేసీఆర్ హయాంలో అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం కల్పించారని గుర్తు చేశారు. అదేవిధంగా షాదీ ముబారక్ పథకాన్ని తీసుకువచ్చిన మైనార్టీ ఆడబిడ్డ పెండ్లి కి రూ.1,00,116 ఆర్థిక సాయం అం దించి ఆదుకున్నారని వివరించారు. ప్రస్తుత ప్రభు త్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు కూడా అమలు చేయడం లేదని ఆరోపించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నా యకులు శ్రీనివాస్‌గుప్తా, రాజుల ఆశిరెడ్డి, చిన్న హనుమంతు, అన్వర్‌హుస్సేన్, మై మూద్, మన్నాన్, సాదిక్, రాజు, ఈశ్వర్‌యాదవ్, రాజు, సాగర్, ముస్లిం మతపెద్దలు, యువకులు పాల్గొన్నారు.