మక్తల్, జూన్ 12 : మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఇటీవలే రాష్ట్ర మంత్రివర్గంలో చేరి ప్రమాణ స్వీకారం చేసిన విషయం విదితమే. తాజాగా బుధవారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో నూతన మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన వాకిటి శ్రీహరికి క్రీడా, యువజన, మస్త్య, పశుసంవర్ధక, డెయిరీ శాఖలు కేటాయించడం హర్షించదగ్గ విషయమని మక్తల్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు రవికుమార్ అన్నారు.
గురువారం ఆయన మక్తల్ లో విలేకరులతో మాట్లాడుతూ..30 సంవత్సరాలుగా శ్రీహరి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నందువల్ల సామాన్యమైన వ్యక్తి శ్రీహరికి మంత్రి పదవి రావడం మక్తల్ నియోజకవర్గంతో పాటు యావత్తు రాష్ట్రమంతా ప్రజలు సంతోషంతో ఉన్నారన్నారు. నూతనంగా మంత్రి పదవి చేపట్టినటువంటి వాకిటి శ్రీహరికి రాబోయే రోజుల్లో కేటాయించిన శాఖలలో పూర్తిస్థాయిలో అభివృద్ధి సాధించి మరింత ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆకాంక్షించారు.