హన్వాడ, నవంబర్ 18 : అభివృద్ధి చూసి ప్రజలు మరోసారి ఆశీర్వదిస్తే సేవకుడిగా పనిచేస్తానని ఎక్సైజ్, క్రీడాశాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మండలంలోని మునిమోక్షం, అమ్మపూరం, మాదారం, నాగంబాయితండాల్లో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మునిమోక్షంలో మహిళలు బోనాలతో ఘన స్వాగతం పలికారు. కారుగుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసిందన్నారు. రైతులకు రైతుబంధు అవసరం లేదంటున్న కాంగ్రెస్ నాయకులు గ్రామాలకు వస్తే నిలదీయాలన్నారు. పేదల కోసం పనిచేస్తున్న ప్రభుత్వాన్ని ప్రతిఒక్కరూ ఆశీర్వదించాలన్నారు. కులాల పేరుతో వచ్చే నాయకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా అమ్మపూరంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రచారం చేస్తుండగా, దివ్యాంగురాలు మంజుల కారు గుర్తుకే మా ఓటు వేసి శ్రీనన్నను గెలిపించుకుంటామని చెప్పారు. అన్నివర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌కు అండగా ఉంటామన్నారు.
హన్వాడ మండలం కొనగట్టుపల్లికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులను ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరగా, తిరిగి గొర్రెకాపరుల సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షుడు శాంతయ్యయాదవ్, మాజీ జెడ్పీటీసీ నర్సింహులు ఆధ్వర్యంలో చెన్నయ్య, బబప్ప, రాఘ, కేశవులు, గోవింద్‌తో పాటు మరో10మంది మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో మాజీ మంత్రి పి.చంద్రశేఖర్, ఎంపీపీ బాల్‌రాజ్, జెడ్పీటీసీ విజయనిర్మల, సింగిల్ విండో చైర్మన్, వైస్ చైర్మన్ వెంకటయ్య, కృష్ణయ్యగౌడ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కరుణాకర్‌గౌడ్, సర్పంచులు రాములమ్మ, శంకర్, ర్యాకమయ్య, జ్యోతి, ఎంపీటీసీలు భాగ్యమ్మ, సోనిబాయి, నాయకులు శేఖర్, నరేందర్, లక్ష్మయ్య, జంబులయ్య, బసిరెడ్డి, సత్యం, శ్రీనివాసులు, హరిచందర్, రామణారెడ్డి, సత్యం, చెన్నయ్య, పాపయ్య, సుక్కయ్య, సంగమేశ్వర్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్, నవంబర్ 18 : పేదలకు అండగా నిలుస్తామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. శనివారం న్యూటౌన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వానగుట్ట, కొత్తగంజి, సింహగిరికి చెందిన ప్రజలు మంత్రిని కలిసి తమకు ఇండ్ల పట్టాలు లేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఇందుకు మంత్రి స్పందించి కష్టపడి కట్టుకున్న ఇండ్లకు హక్కులు లేకపోవడం బాధాకరమని, అన్ని విధాలుగా అండగా నిలిచి యాజమాన్య హ క్కుల వచ్చేలా చూస్తామని భరోసానిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు కృష్ణమోహన్, కౌన్సిలర్లు నర్సింహులు, జాజిమొగ్గ నర్సింహులు, వార్డు అధ్యక్షుడు శివ, సత్యం, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కేంద్రంలోని న్యూటౌన్ పార్టీ కార్యాలయంలో గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు శాంతన్నయాదవ్, ముదిరాజ్ సంఘం నాయకుడు గాలయ్య ఆధ్వర్యంలో బండ్లగేరికి చెందిన నరేశ్, రాము, ఆంజనేయులుతోపాటు 50మంది నాయకులు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. అలాగే 31వ వార్డుకు చెందిన కాంగ్రెస్ వార్డు కౌన్సిలర్ సయ్యద్ ఆధ్వర్యంలో ఎండీ మసూద్, బలాల, ఎండీ జకీ, ఎండీ ఇలియాజ్, ఎండీ ఆరిఫ్, ఎండీ ఆమేర్తోపాటు 30మంది నాయకులు మంత్రి సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు.
మహబూబ్‌నగర్ టౌన్, నవంబర్ 18 : పదేండ్లలో మహబూబ్‌నగర్‌ను ఊహించని విధంగా అభివృద్ధి చేశామని, ఓట్ల కోసం వచ్చే అభివృద్ధి విరోధులను తరిమికొట్టాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని పద్మావతికాలనీ, వడ్డెరబస్తీ, టీచర్స్‌కాలనీ, పాలకొండ తండా, భాగ్యనగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి పి.చంద్రశేఖర్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న, మాజీ మున్సిపల్ చైర్మన్ ముత్వాల ప్రకాశ్, మున్సిపల్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ కట్టా రవికిషన్‌రెడ్డి, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు శివరాజ్, కౌన్సిలర్ నరేందర్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.