మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో చేపడుతున్న రహదారుల విస్తరణ, కూడళ్ల పనులు త్వరగా పూర్తి చేయాలని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అధికారులకు సూచించారు. సోమవారం ఆర్అండ్బీ కూడలి, అప్పన్నపల్లి బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం కేసీఆర్ ఎకో అర్బన్ పార్కులో మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతిపాదిత రోడ్లను విస్తరించి, ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటాలని సూచించారు. మినీ శిల్పారామంలో బోటింగ్, అడ్వెంచర్ పార్కు ఏర్పాటు చేయాలన్నారు.
మహబూబ్‌నగర్‌టౌన్, జనవరి 16 : జిల్లా కేంద్రంలోని రహదారులు, జంక్షన్ల పను లు త్వరగా పూర్తి చేయాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సూచించారు. సోమవారం పట్టణంలోని ఆర్అండ్బీ కూడలి, అప్పన్నపల్లి బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించారు. అ నంతరం కేసీఆర్ ఎకో అర్బన్ పార్కులో మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పట్టణంలోని ప్రతిపాదిత రోడ్లను విస్తరించాలని, జంక్షన్ల అభివృద్ధి ప నులు తక్షణమే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేసినందున.. పరిపాలన అనుమతులకు ప్రతిపాదనలు సమర్చించాలన్నా రు.
పట్టణంలో ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటి పచ్చదనాన్ని మెరుగుపర్చాలన్నారు. క ల్వర్టులు, నాలాలు ఆక్రమణకు గురికాకుండా చూడాలన్నారు. పట్టణంలో ప్రతి రోడ్డు ను ప్రధాన రహదారికి అనుసంధానం చేసేలా సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. ఇంటర్నల్ రోడ్లు కూడా విశాలంగా ఉండాలన్నారు. గ్రంథాలయ, తూర్పుకమాన్ చౌరస్తా వంటి చారిత్రక ప్రాశస్త్యం ఉన్న కూడళ్లను అభివృద్ధి చేయాలన్నారు. మినీ శిల్పారామంలో పిల్లలకు బోటింగ్, అడ్వెంచర్ పార్కు ఏర్పాటు చేయాలన్నారు. సమీక్షలో కలెక్టర్ వెంకట్రావు, అదనపు కలెక్టర్ తేజస్‌నందలాల్‌పవార్, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్, పీఆర్‌ఈఈ నరేందర్, మున్సిపల్ ఇంజినీర్లు, టౌన్‌ప్లానింగ్ అధికారులు ఉన్నారు.
పేదల సంక్షేమమే ధ్యేయం..
పాలమూరు, జనవరి 16 : పేదల సంక్షేమమే ధ్యేయంగా సర్కార్ పనిచేస్తున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి డా.వి.శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని కుర్హిని శెట్టి కాలనీలో ఉన్న జాండ్ర కమ్యూనిటీహాల్లో ఉమ్మడి జిల్లా జాండ్ర ఉద్యోగుల సం ఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వృత్తులు క్రమంగా కులాలు, ఉపకులాలుగా మార్పు చెందాయన్నారు. కొందరు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ అంశాన్ని బయటకు రాకుండా చేశారన్నారు. జాండ్ర ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సామాజిక కార్యక్రమాలు చేపట్టడం సంతోషించదగ్గ విషయమన్నారు. విద్యార్థులకు కెరీర్ పరంగా స హాయసహకారాలు అందించాలన్నారు.
హైదరాబాద్‌లో జాండ్ర ఆత్మగౌరవ భవనం నిర్మాణం కోసం తన వంతు కృషి చేయనున్నట్లు తెలిపారు. కులమతాలకతీతంగా అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పనిచేయడమే తమ ధ్యేయమన్నారు. జిల్లాప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా నిలుస్తానన్నారు. హైదరాబాద్ స్థాయి అధునాతన వైద్య సే వలు స్థానికంగానే అందించడమే ధ్యేయంగా పాత కలెక్టరేట్ స్థానంలో రూ.500 కో ట్లతో సూపర్ స్పెషాలిటీ దవాఖాన ఏర్పాటు చేస్తున్నామన్నారు. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనలో నెంబర్‌వన్‌గా తీర్చిదిద్దుతామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, ముడా చైర్మన్ వెంకన్న, కమిషనర్ ప్రదీప్‌కుమార్, జాండ్ర ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు శివశంకర్, ప్రధానకార్యదర్శి రాంచందర్, కోశాధికారి వెంకటేశ్, నీలకంఠుడు, లింగమయ్య, ఉపాధ్యక్షురాలు భ్రమరాంబ, కో ఆప్షన్ స భ్యుడు రామలింగం, మహేందర్, గోపి, మల్లేశ్, డా.శశికాంత్ తదితరులున్నారు.