‘కామన్ సెన్స్ లేని కాంగ్రెస్ నాయకులు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే రైతు బంధు పథకాన్ని నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.. అన్నదాతలపై హస్తం పార్టీ నేతలు అక్కసు కక్కడం పరిపాటిగా మారింది.. రైతు బంధు పథకం ఎన్నికల కో సం తెచ్చిన పథకం కాదు.. ఇప్పటికే 11విడుతలుగా రైతుల ఖాతాల్లో రూ.72వేల కోట్లు జమచేశాం.. కాంగ్రెస్ నాయకులు ఎన్ని ఆటంకాలు సృష్టించినా రైతుబంధు ఆగ దు’.. అని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నా రు. శుక్రవారం జిల్లా కేంద్రంలో తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించి కాంగ్రెస్ నాయకులపై ఫైర్ అయ్యారు. అనంతరం మంత్రి స మక్షంలో హైకోర్టు న్యా యవాది పద్మ బీఆర్ఎస్లో చేరా రు.
వనపర్తి, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ) : అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే కామన్ సెన్స్ లేని కాంగ్రెస్ నాయకులు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు రైతుబంధు పథకం పంపిణీ నిలిపివేయాలని లేఖ రాశారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. అవసరమైతే ప్రజా అంశాల మీద పోరాటం చేయాలి కానీ అన్నదాతలకు మేలు చేసే పథకాన్ని ఆపాలని కాంగ్రెస్ ప్రయత్నించడం అత్యంత దుర్మార్గమని మంత్రి పేర్కొన్నారు. రైతుబంధు పథకాన్ని నిలిపివే యాలని ఈసీకి కాంగ్రెస్ లేఖ రాయడంపై మంత్రి శుక్రవారం తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మట్టిని, కష్టాన్ని నమ్ముకొని సేద్యం చేస్తున్న రైతన్నకు సీఎం కేసీఆర్ రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు. రైతుబంధు, రైతుబీమా పథకాలు అంత ర్జాతీయ స్థాయిలోనే ఎంతో ప్రాముఖ్యతగా నిలిచాయని యూఎన్వో అనే సంస్థ నిర్ధారించిందని స్పష్టం చేశారు. రైతులపై కాంగ్రెస్‌కు ఏనాడు ప్రేమ లేదని, ఇప్పుడు కూడా అన్నదాతలపై మరోసారి తమ అక్కసును వెల్లగక్కుతూ రైతుబం ధు పథకాన్ని నిలిపివేయాలని నిర్ణయించుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌కు ఎప్పుడు రాజకీయమే కావాలి తప్పా ప్రజల బాగోగులు ఏనాడు పట్టించుకో లేదన్నారు. దేశంలోనే ఏ నాయకుడికి రాని ఆలోచన సీఎం కేసీఆర్‌కు వచ్చిందని, రైతుల కష్టాలు గట్టెక్కించాలన్న లక్ష్యంతోనే రైతుబంధు, రైతుబీమా పథకాలను బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్నదన్నారు.
ఏనాడు రాజకీయ కోణంలో ఈ పథకాలను చూడలేదని, ఎన్నికలు గతంలో కూడా వచ్చాయని, అయినా ఈ పథకం ఏడాదిలో రెండు దఫాలు వానకాలం, యాసంగిలో రైతుల బ్యాంకు ఖాతాల్లో సమయానుకూలంగా డబ్బులు వేసుకుంటూ వెళ్లామని మంత్రి చెప్పారు. ఈ పథకంలో ముందుగా 90శాతం ఉన్న సన్న, చిన్న కారు రైతులకే డబ్బులు వేస్తారన్నారు. కాంగ్రెస్ ఎన్ని ఫిర్యాదులు చేసినా రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ పథకాలు ఆగవని మంత్రి సింగిరెడ్డి రైతులకు భరోసా ఇచ్చారు. వచ్చే యాసంగిలో రైతుబంధు పడుతుందని, ఇందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేసిందని మంత్రి చెప్పారు. ఇప్పటివరకు 11 విడుతల్లో రూ.72,815 కోట్లు రైతుబంధు పథకం ద్వారా అన్నదాతలకు అందించామన్నారు. రైతుల బాగు ఏమాత్రం పట్టని కాంగ్రెస్ జూఠాకోరు మాటలతో రాజకీయం చేయాలని చూస్తున్నదన్నారు. హుజూరునగర్ ఉప ఎన్నికల కోసమే దళితబంధు పథకాన్ని తెచ్చారని గోల చేసిన కాంగ్రెస్‌కు క్రమంగా దళితబంధు అమలు జరుగుతున్న తీరు కనబడటం లేదా అని మంత్రి సింగిరెడ్డి ప్రశ్నించారు. 40 ఏండ్లపాటు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎస్సీ కార్పొరేషన్లు ఎంతమేర అభివృద్ధి చేశాయో ఒక్కసారి పరిశీలించాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టిన పథకాలను నేడు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నదన్నారు.
ఎన్నికలొస్తే ధాన్యం కొనుగోళ్లను సహితం కాంగ్రెస్ నిలిపివేయాలని కోరుతుందని మంత్రి ఎద్దేవా చేశారు. పరిణతితో ఆలోచించాల్సిన కాంగ్రెస్ రైతుల జీవితాలతో ఆడుకుంటుందని మంత్రి విమర్శించారు. పక్క రాష్ట్రమైన కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఎంత ఘోస పెడుతున్నదో అక్కడి రైతులు ఇక్కడికి వచ్చి వెల్లడిస్తున్న ఘటనలను మంత్రి గుర్తు చేశారు. కేవలం అరకొరగా కర్ణాటకలో రైతులకు కరెంట్‌ను అందిస్తున్న కాంగ్రెస్ తెలంగాణలో అదే రైతులతో రాజకీయం చేయాలని చూస్తున్నదని, కాంగ్రెస్ వ్యవహారంపై తెలంగాణ రైతులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్త వంగూరు ప్రమోద్‌రెడ్డి, గొర్రెల కాపరుల సంఘం జిల్లా అధ్యక్షుడు కురుమూర్తి యాదవ్, జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, ఎన్నికల శిక్షణ తరగతుల కన్వీనర్ మెంటెపల్లి పురుషోత్తం రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్ రెడ్డి, నాయకులు నాగం తిరుపతి రెడ్డి, లక్ష్మారెడ్డి, నందిమళ్ల అశోక్, రమేశ్, శ్యాంకుమార్, పుట్టపాకల మహేశ్, జహంగీర్, విష్ణు యాదవ్, నరేశ్ పాల్గొన్నారు.
గోపాల్పేట, అక్టోబర్ 27 : మండలంలోని చెన్నూరు సర్పంచ్ జిల్లెల శేషిరెడ్డి (కాంగెస్), సింగిల్‌విండో డైరె క్టర్ నారాయణరావుతోపాటు కాంగ్రెస్‌కు చెందిన 25 మంది శుక్రవారం క్యాంప్ కార్యాలయంలో మంత్రి నిరంజన్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేసిన వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి సా దరంగా ఆ హ్వానించారు. పార్టీలో చేరిన వారిలో గడ్డం నాగరాజు, రాధాకృష్ణ, బాలరాజు, దామోదర్‌రెడ్డి, ఎ ల్లారెడ్డి, మల్లేశ్ ఉన్నారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు అడ్డాకుల తిరుపతి యా దవ్, బీఆర్ఎస్ నాయకులు నాగం తిరుపతిరెడ్డి, పార్టీ గ్రామ అధ్యక్షుడు మొగులాలు నాయకులు మంద కో టీశ్వర్రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రాంబాబురావు, అమ్రూ నాయక్ తదితరులు పాల్గొన్నారు.