కోస్గి, అక్టోబర్ 20 : కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు పెద్ద బోగ స్ అని సమాచార, భూగర్భ గనుల శాఖ ల మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. సీఎం పదవి కోసం ఎంతో మం ది పోటీ పడుతున్నారని, అలాంటి కు మ్ములాటల పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. కోస్గి పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలతో శుక్రవారం సమావేశం ఏ ర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలో ఉ న్న కర్ణాటకలో ఆరు గ్యారెంటీలు ఎం దుకు అమలు చేయడం లేదని ప్రశ్నించా రు. 50 ఏండ్లుగా ఎలాంటి అభివృద్ధికి నోచుకోని కొడంగల్ నియోజకవర్గంలో కేవలం ఐదేండ్లలోనే ఎన్నో పనులు చేపట్టామన్నారు. అనునిత్యం ప్రజల్లో తిరిగే పట్నం నరేందర్‌రెడ్డి లాంటి వ్యక్తి ఎమ్మెల్యేగా కావాలా..? ఎన్నికల సమయం లో మాయమాటలు చెప్పి హైదరాబాద్ కే పరిమితమయ్యే కాంగ్రెస్ నాయకులు కావాలా అనే విషయాన్ని ప్రజలు ఆలోచించుకోవాలన్నారు.
పట్నం నరేందర్‌రెడ్డిని ఆదరించి కారుగుర్తుకు ఓటేయాలని కోరారు. రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఓటు అడిగే హక్కు ఉందన్నారు. అభివృద్ధి, సంక్షేమమే తమకు శ్రీరామరక్షగా నిలుస్తుందన్నారు. కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి గడపగడపకూ సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలన్నారు. కార్యకర్తలకు ఏ స మస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలన్నారు. అంతకుముందు ఈజీఎస్ డైరెక్టర్ ప్రతాప్‌రెడ్డి మంత్రిని ఘనంగా సన్మానించారు. సమావేశంలో జెడ్పీటీసీ ప్రకాశ్‌రెడ్డి, ఎంపీపీ మధుకర్‌రావు, వైస్ ఎం పీపీ సాయిలు, మున్సిపల్ చైర్పర్సన్ శిరీష, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు హన్మంత్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు జగదీశ్వర్‌రెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు రాజేశ్, కౌన్సిలర్లు శ్రీనివాస్, బందెప్ప, జనార్దన్‌రెడ్డి, నాయకులు వెంకట్‌నర్సింహులు, రాజేందర్‌రెడ్డి, బాలరాజు, హు స్సేనప్ప, అమృతమ్మ, రాములు, విజయ్‌కుమార్, అనంతయ్య, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.