చిన్నంబావి, మే 19 : అన్ని ప్రభుత్వ పాఠశాల ల్లో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా మౌలిక వసతులు కల్పిస్తామని, ప్రతి విద్యార్థికి మెరుగైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని పెద్దమారూర్, పెద్దదగడలోని ప్రభుత్వ పాఠశాలలను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ని యోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తన సొంత నిధులతో అన్ని రకాల సౌకర్యాలు కల్పిం చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
తన స్వగ్రా మమైన పెద్దదగడ, విద్యనందించిన పెద్దమారూర్ గ్రామాల పాఠశాలల నుంచే అభివృద్ధి పనులకు శ్రీ కారం చుట్టనున్నట్లు ప్రకటించారు. గ్రామాల్లో పేద లు, మధ్య తరగతి వారు స్థాయిని మించి పిల్లల వి ద్య కోసం కార్పొరేట్ పాఠశాలకు రూ.లక్షల్లో ఫీజు లు కట్టి అప్పులపాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ బాధలు తొలగించేందుకు ప్రభుత్వం పాఠశాలల్లో అన్ని వసతులు కల్పించి కార్పొరేట్ స్థా యిలో ఉచితంగా విద్యను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు.
అందుకే ప్రజలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించి ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పెద్దదగడ ఎంపీటీసీ పుష్పావతి, రత్నగిరి ఫౌండేషన్ కన్వీనర్ కేతూరి ధర్మతేజ, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు చంద్రశేఖర్, సీనియర్ నాయకులు కల్యాణ్‌కుమార్, చిదంబరెడ్డి, కృ ష్ణాప్రసాద్యాదవ్, బీచుపల్లి యాదవ్, మాజీ స ర్పంచులు సురేంద్రసింగ్, రంజిత్‌కుమార్, ఈదన్నయాదవ్, నరేందర్‌గౌడ్, వడ్డెమాన్ బిచ్చన్న, బొల్లి కురుమయ్య, శ్రీను, కరాల వెంకటేశ్, శంకర్, మ ధుగౌడ్, మద్దిలేటి, యుగేందర్‌గౌడ్, జగదీశ్ తదితరులు పాల్గొన్నారు.