మదనాపురం, జనవరి 14 : రైతులు వేసిన పంటలకు చివరి తడి అందిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు. ఆదివారం ఇరిగేషన్ ఎస్ఈతో కలిసి రామన్‌పాడు రిజర్వాయర్తోపా టు తిర్మలాయపల్లి గ్రామ శివారులోని భీమా ఫేజ్-2 పంప్‌హౌజ్‌ను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ వనపర్తి, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో రైతులు వేసుకున్న మెట్ట పంటలు చివరి దశలో ఉన్నాయని, వీటికి ఒక తడి అందిస్తే అవి బయటపడతాయన్నారు.
ముఖ్యంగా కొల్లాపూర్ నియోజకవర్గంలోని చిన్నంబావి, వీపనగండ్ల, పాన్‌గల్ మండలాల్లో రైతులు వేరుశనగ, మినుములు, పెసర పంటలు వేశారని ఒక తడి నీటిని అంది స్తే రైతులు నష్టపోకుండా ఉంటారన్నారు. మరోపక్క జూరాల ప్రాజెక్టుతోపాటు వివిధ రిజర్వాయర్లలో నీరు అడుగంటడంతో కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి నీటిని విడుదల చే యించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ముఖ్యంగా మదనాపురం మండలంలో ని నెలివిడి, నర్సింగాపురం ఎత్తిపోతల పథకం పనిచేయడం లేదని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఎస్ఈని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ పథకం పైప్‌లైన్‌లో లోపాలు ఉన్నాయని, దీ న్ని సరిచేసేందుకు. రూ.70లక్షలతో ఇదివరకే ప్రతిపాదనలు పంపామని చెప్పారు. ఆ పనులు పూర్తి చేసి త్వరలో రైతులకు అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అదేవిధంగా నెలివిడి, నర్సింగాపురం, కొన్నూరు. ద్వారకానగరంలోని చెరువులను నింపి వేసవిలో పశువులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని మంత్రి జూపల్లి అధికారులను ఆదేశించారు.
శ్రీరంగాపురం, జనవరి 14 : మండలకేంద్రంలోని ప్రసిద్ధిగాంచిన రంగనాయకస్వామి ఆలయాన్ని మంత్రి జూపల్లి దర్శించుకొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు మంత్రికి పూ ర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రి స్వామివారికి ప్రత్యేక పూ జలు నిర్వహించగా అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వ చనం పలికారు. మంత్రి జూపల్లి మా ట్లాడుతూ రంగనాథస్వామి ఆలయ అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తామని చె ప్పారు. ఆయన వెంట జెడ్పీటీసీ రాజేంద్రప్రసాద్ ఉన్నారు.