కొల్లాపూర్, జూలై 13 : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు మొదటి పంప్‌హౌస్‌లో మోటర్ వెట్న్‌క్రు చేసేందుకు ఇంజినీరింగ్ అధికారులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం రేగుమాన్గడ్డ వద్ద లిఫ్ట్-1లోని మొదటి పంప్ వద్ద నాలుగు రోజులుగా పెద్ద హైడ్రామా నడుస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రాజెక్టుల సలహాదారుడు పెంటారెడ్డి మౌఖిక ఆదేశాలతో లిఫ్ట్-1లోని బాహుబలి మోటర్‌ను ఆన్ చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిసింది.
అయితే పూర్తి స్థాయి సాంకేతికతను పరిశీలించకుండానే ప్రయత్నాలు జరుగుతున్నట్లు వెల్లడైం ది. కొద్ది రోజులుగా పెంటారెడ్డి పంప్‌హౌస్ వద్ద ఉంటూ పర్యవేక్షణ చేస్తున్నారట. ఆదివారం అర్ధరాత్రి మోటర్ ఆన్ చేసేందుకు ప్రయత్నించగా విద్యుత్ సరఫరా ట్రిప్ అయినట్లు సమాచారం. మళ్లీ సోమవారం ఉదయం, మ ధ్యాహ్నం, సాయంత్రం మోటర్‌ను ఆన్ చేస్తున్నట్లు లీక్‌లు వచ్చినా.. రాత్రి 7 గంటల వరకు కూడా సాంకేతిక సమస్యలతో మోటర్‌ను ఆన్ చేయలేకపోయినట్లు తెలుస్తోంది.
పీఆర్ఎల్ఐ పంప్-1 వద్ద నాలుగు రోజులుగా హైడ్రామా నడుస్తున్నట్లు తెలుస్తోంది. పాలమూరు-రంగారెడ్డి ప్రా జెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ 2023 సెప్టెంబర్ 16వ తేదీన బాహుబలి మోటర్‌ను ప్రారంభించారు. కృష్ణా జలాలు దాదాపు 2 టీఎంసీల వరకు నార్లాపూర్ రిజర్వాయర్‌లోకి నీటిని ఎత్తిపోశారు. తర్వాత ప్రభుత్వం మారి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కృష్ణానదిలో నీళ్లు పుష్కలంగా ఉన్నా.. బాహుబలి మోటర్లు నిరుపయోగంగా మిగిలిపోయాయి. మళ్లా మూడేండ్ల తర్వాత ప్రస్తుతం కృష్ణమ్మకు స్వల్ప వరద ప్ర వాహం కూడా లేని సమయంలో నాడు ఆన్ చేసిన మోటర్‌ను ప్రస్తుతం వెట్న్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. గత సీజన్లలో శ్రీశైలం డ్యాం నిండుకుండలా ఉన్నా నీటిని పంపింగ్ చేయలేదు.
పీఆర్ఎల్ మోటర్లు ప్రపంచంలోనే అత్యంత భారీ మో టర్లు, 145 మెగావాట్లు ఇంత పెద్ద మోటర్లు పూర్తి సామర్థ్యంతో సురక్షితంగా నడవాలంటే నీటిమట్టం కనీసం 825నుంచి 830 అడుగుల పైన ఉండడం అవసమని ఇరిగేషన్ అధికారులు సూచిస్తున్నారు. శ్రీశైలం నీటి మట్టం తక్కువగా ఉన్నప్పుడు ఆన్ చేస్తే మోటర్ల యొక్క హెవీ సెక్షన్ పవర్ వల్ల అప్రోచ్ చానల్లో నీటి మట్టం వేగంగా తగ్గి పంపుల్లోకి గాలి చేరే ప్రమాదం ఉంటుందని, దీనివల్ల భారీ మోటర్లు విపరీతంగా వైబ్రేటై ట్రిప్ అవుతాయని.. లేదా మోటర్ బ్లేడ్లు దెబ్బతినే అవకాశం ఉంటుందని ఇరిగేషన్ శాఖ నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుత శ్రీశైలం నీటి మట్టం తక్కువగా ఉన్నప్పుడు మోటర్లను ఆన్ చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలల్లో సాంకేతిక సమస్యలు వస్తున్నట్లు తెలుస్తోంది.
పీఆర్ఎల్ఐ లిఫ్ట్-1లో మంగళవారం ఉదయం నాటికి సాంకేతిక సమస్యలను అధిగమించి మోటర్ ట్రయల్ రన్ చేస్తామని అధికారులు ప్రకటించారు. నీటి ప్రవాహం లేనప్పుడు గోప్యంగా మోటర్లతో ట్రయిల్న్ చేయాల్సిన అవసరం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. కాళేశ్వరం వద్ద నీళ్లను లిఫ్ట్ చేయాలన్న డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో వాటర్ లిఫ్ట్ చేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వానికి మైలేజ్ వస్తోందని భావించిన రేవంత్ సర్కార్ హడావుడిగా ట్ర యల్న్ పేరుతో ప్రయత్నాలు ప్రారంభించింది. శ్రీశైలం జలాశయంలో నీళ్లు లేవని తెలిసినా పాలమూరు-రంగారెడ్డి మొదటి పంప్‌హౌస్ నుంచి నీటిని లిఫ్ట్ చేసి డైవర్ట్ పాలిటిక్స్‌కు కుట్ర పన్నినట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వరద లేని సమయంలో మోటర్లను ఆన్ చేసి ప్రమాదంలోకి నెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు మండిపడ్తున్నారు.
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ చేతులు మీదుగా 1/3 కృష్ణానది నీళ్లను నార్లాపూర్ రిజర్వాయర్‌లో పంపింగ్ చేశారు. ఆ తర్వాత ఏడాది 2/3 కానీ, గతేడాది పంపింగ్ చేయాల్సిన 3/3 నీటిని రిజర్వాయర్‌లోకి విడుదల చేయలేదు. డ్యాం సేఫ్టీ ప్రకారం దశల వారీగా బండ్ దెబ్బతిన్నకుండా నీటిని నింపాలని నిపుణులు సూచనలను కూడా లెక్క చేయలేదు. గత సీజన్లో శ్రీశైలం నిండుకుండలా ఉన్నా నీళ్లను పంపింగ్ చేయలేదు.
కానీ ప్రస్తుతం ప్రాజెక్టులో 820 అడుగులు మాత్రమే నీటిమట్టం ఉన్నప్పుడు.. కనీసం వరద కూడా రాని సమయంలో ట్రయల్న్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. ప్రాజెక్టులు రన్ కావాలంటే కనీసం 854 అడుగులు డ్యాంలో నీరు ఉండాలని నిపుణులు సూచిస్తున్నా.. ఇప్పుడు నాలుగు బాహుబలి మోటర్ల ద్వారా 6 టీఎంసీల నీటిని నార్లాపూర్ రిజర్వాయర్‌లోకి పంపింగ్ చేస్తారా? లేదా? అన్న విషయాన్ని ప్రభుత్వం ప్రకటించలేదు. అధికారులు మాత్రం వారం గ్యాప్‌తో నాలుగు మోటర్లను ట్రయల్ రన్ చేస్తామని ప్రకటించారు. నీళ్లు ఉన్న చోట లిఫ్ట్ చేయకుండా నీళ్లు లేని చోట ట్రయల్ రన్ పేరుతో నడిపిస్తే మోటర్లకు తలెత్తే సమస్యలపై ప్రభుత్వం కానీ, అధికారులు కానీ క్లారిటీ ఇవ్వడం లేదు.