అచ్చంపేట, ఏప్రిల్ 1 : గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. అచ్చంపేట మండలం అంకిరోనిపల్లి గ్రామంలో బుధవారం వారు పర్యటించారు. అచ్చంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నర్సయ్యయాదవ్ అంకిరోనిపల్లి గ్రామంలో రోడ్డు ను ఆక్రమించుకొని ఇల్లు నిర్మిస్తుండగా గ్రామస్తుల ఫిర్యాదుల మేరకు రోడ్డును పరిశీలించడానికి వెళ్లిన బీఆర్ఎస్ గిరిజన మహిళా సర్పంచ్ కొర్ర కమల, భర్త సతీశ్ వార్డు సభ్యుడు సీతారాంపై దాడిని చేయగా బుధవారం వారిని పరామర్శించారు.
అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మర్రి జానార్దన్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఆగడాలను ప్రశ్నించడానికి వెళ్లిన సర్పంచ్, ఇతరులపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అంకిరోనిపల్లిలో రోడ్డును ఆక్రమించి నిర్మాణం చేస్తుంటే ఎమ్మెల్యేకు కళ్లు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. పోలీసులకు ఉపయోగించుకొని ఎన్ని అక్రమ కేసులు పెట్టినా బీఆర్ఎస్ క్యాడర్ భయపడదని మొక్కవోని ధైర్యంతో నిలబడి కాంగ్రెస్ ఆగడాలను ఎదుర్కొనే సత్తా ఉందన్నారు. పోస్టింగ్ కోసం పోలీస్ అధికారులు కొందరు ఎమ్మెల్యేకు కార్యకర్తలుగా మారి ఎమ్మెల్యే ఏమి చెబితే వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారని, నాగర్‌కర్నూల్, అచ్చంపేట ప్రాంతాల్లో పనిచేస్తున్న కొందరు పోలీసులు వచ్చే బీఆర్ఎస్ పాలనలో వారిని ఎక్కడ ఉన్న వదలమని హెచ్చరించారు.
రెండేళ్లలో తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని కార్యకర్తలు, ప్రజలు ధైర్యంగా ఉండాలని సూచించారు. అచ్చంపేట ఎస్సైని 2029లో ఇదే గ్రామానికి తీసుకొస్తామని అన్నారు. అచ్చంపేట ఎమ్మె ల్యే వంశీకృష్ణ పక్క ఊరిలో విహారయాత్రకు వెళ్ల డం కాదని మీ ఊరిలో ఏమి జరుగుతుందో దృష్టి పెట్టమని సూచించారు. ఎమ్మెల్యే బీఆర్ఎస్ కార్యకర్తలపై కేసులు పెట్టించడం మానుకోని అచ్చంపేట అభివృద్ధి కోసం కృషి చేయాలని సూచించారు. అచ్చంపేట బీఆర్ఎస్ కార్యకర్తలు భయపడవద్దని ప్రతి వారం తాను, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌లు పర్యటిస్తామని, ఇక్కడ పార్టీ బలంగా ఉంద ని ధైర్యంగా ఉండాలని సూచించారు.
ఎమ్మెల్యే వంశీకృష్ణ గ్రామాల్లో కబ్జాలు, దౌర్జన్యాలు దాడులు చేయాలని ప్రోత్సహిస్తున్నారని దీనితో గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోతున్నారని ఇది మంచి పద్ధతి కాదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హితవు పలికారు. అంకిరోనిపల్లి గ్రామం లో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నర్సయ్య యాద వ్ రోడ్డును ఆక్రమించుకొని ఇల్లు కడుతుంటే గ్రామస్తుల సూచనల మేరకు అక్కడికి వెళ్లిన సర్పంచ్ కమల, భర్త సతీశ్‌పై కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దాడి చేయడాన్ని ఎమ్మెల్యే, పోలీసులు ఏవిధంగా సమర్థిస్తారని ప్రశ్నించారు.
ఒక గిరిజన మహిళా సర్పంచ్‌పై అక్రమంగా దాడి చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని పక్కనే ఉన్న దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్, ఎడ్మ బొజీ, బెల్లయ్య నాయక్, గిరిజన ఎమ్మెల్యేలు ఎందుకు నోర్లు మూసుకొని సీఎం రేవంత్ రెడ్డికి భయపడి కనీసం అసెంబ్లీలో కూడా ప్రస్తావించకుండా భయపడి పనిచేస్తున్నారని ప్రశ్నించారు. వట్టినాగులపల్లిలో రెవెన్యూ మంత్రి కబ్జాలు చేస్తుంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కబ్జాలు చేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ అంటేనే అక్రమాలు, దాడులకు నిలయంగా మారిందన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు ఎక్కడ అన్యాయం జరిగిన కా పాడుకుంటామని, అండగా ఉంటామని భరోసా కల్పించారు. పేదల సమస్యలకు గొంతుకగా ఉం డేందుకు తాను రాజకీయాల్లోకి వచ్చానని, ఎమ్మె ల్యే, ఎంపీ కావాలనే ఉద్దేశం తనకు లేదని తెలిపారు. కేసీఆర్‌ను తిరిగి అధికారంలోకి తేవడానికి అందరం కలిసి పనిచేద్దామని సూచించారు.
ఇక నుండి అచ్చంపేట నియోజకవర్గానికి తాను అండ గా ఉంటానని వారానికోసారి వస్తానని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఆయన సోదరుల ఆగడాలు భరించలేక కొండారెడ్డిపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఎక్కడ చూసిన కాంగ్రెస్ పార్టీపై ప్రజలు తిరగబడుతున్నారని ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశామని బాధపడుతున్నారని అన్నారు. అనంతరం గ్రామ సర్పంచ్ కొర్ర కమల, భర్త సతీశ్‌లు మాట్లాడుతూ అంకిరోనిపల్లి గ్రామం అంటేనే గులాబీ సైనికులమని ఎన్ని దాడులు, కుట్రలు మాపై జరిగిన భయపడమని అన్నారు. గ్రామంలో రూ.70లక్షలతో సీసీ రోడ్లు వేసి మూడేళ్లు గడిచిందని ఈ బిల్లుల కోసం వెళ్తే కాంగ్రెస్ పార్టీలో చేరాలని అంటున్నారని అన్నా రు. బిల్లులు రాకున్నా ఫర్వాలేదు కానీ బీఆర్ఎస్ పార్టీని వదలమని అన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నర్సయ్య యాదవ్ ఆక్రమించి నిర్మాణం చేసిన రోడ్డును పరిశీలించారు.
రోడ్డును ఆక్రమించి నిర్మాణం చేసినది కళ్లకు కనిపిస్తున్నా కలెక్టర్, ఎస్పీ ఇతర అధికారులు ఎందుకు స్పం దించడం లేదని ప్రశ్నించారు. అంతకుమందు బల్మూర్ మండలం జిన్‌కుంట గ్రామంలో గ్రామ సర్పంచ్ రంగినేని పుష్పలత ప్రేమ్‌కుమార్‌లతో మాట్లాడారు. గ్రామానికి వెళ్లి గ్రామంలో కాంగ్రెస్ నాయకులు చేస్తున్న దాడులు, అరాచకాలపై ఆరాతీశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నా యకులు పోకల మనోహర్, అమీనోద్దీన్, మం డల పార్టీ అధ్యక్షుడు పర్వతాలు, మాజీ మున్సిపల్ చైర్మన్లు తులసీరాం, నర్సింహాగౌడ్, శ్రీ కాంత్ భీమా, శ్రీనివాస్‌యాదవ్, నర్సయ్య యా దవ్, బండపల్లి వెంకటయ్య, అంతటి శివ, రమేశ్ రావు, వంశీ, బొడ్కనాయక్, నరేందర్‌రావు, శ్రీపతి రావు, అంకిరోనిపల్లి గ్రామస్తులు శంకర్, రాకేశ్, రమేశ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.