నాగర్‌కర్నూల్, మార్చి 29 : అల్లా దీవెనలు ప్రతిఒక్కరిపై ఉండాలని, పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ఫలించాలని నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని రూబీ గార్డెన్స్ హాల్లో రంజాన్ పండగ సందర్భంగా నియోజకవర్గ ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజానికి ఉపయోగపడే అల్లా బోధనలను ప్రతిఒక్కరూ పాటించాలన్నారు. సర్వమతాలను బీఆర్ఎస్ సమానంగా చూస్తుందన్నా రు. కేసీఆర్ సర్కారులో పేద ముస్లింలకు రంజాన్ తోఫా, మసీదు ఇమా మ్, మౌజాన్లకు పారితోషకం అందిచినట్లు గుర్తుచేశారు. కాంగ్రెస్ సర్కారు పండుగను పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. రాబోయే రోజు ల్లో మంచి రోజులు వస్తాయన్నారు. పండుగ శుభాకాంక్షలు తెలిపారు.