బాలానగర్, సెప్టెంబర్ 29 : రాష్ర్టాభివృద్ధి సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఉడిత్యాలకు చెందిన బీఎస్పీ నాయకుడు నర్సింహయాదవ్, బీజేపీ గ్రామ యూత్ అధ్యక్షుడు లింగంయాదవ్ బీఆర్ఎస్ యూత్వింగ్ మండల ఉపాధ్యక్షుడు నరేందర్ ఆధ్వర్యంలో పలువురు బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించి మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో జడ్చర్ల నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురవేసేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. సమ్మె చేస్తున్న అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్ల వద్దకు వెళ్లి వారి సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.
అనంతరం మండలంలోని తిరుమలగిరికి చెందిన శివకు ఎస్సీ కార్పొరేషన్ నిధుల కింద మంజూరైన రూ.8లక్షల టాటా ఏసీ ట్రాలీ వాహనాన్ని బీఆర్ఎస్ నాయకుడు జగన్నాయక్తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. అంతకుముందు మండల కేంద్రంలోని భవానీనగర్ కాలనీ లో రైజింగ్ స్టార్ యువజన సంఘం ఆధ్వర్యంలో కొలువైన గణనాథుడికి ఎమ్మెల్యే శుక్రవారం పూ జలు చేశారు.
బీఆర్ఎస్ నాయకుడు గణేశ్గౌ డ్ నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని భక్తులకు భోజనం వ డ్డించారు. కాగా లడ్డూను మండల కేంద్రానికి చెందిన అశోక్ రూ.75 వేలకు దక్కించుకున్నాడు. ఆ యా కార్యక్రమాల్లో వైస్‌ఎంపీపీ వెంకటాచారి, బీఆర్ఎ స్ మండల అధ్యక్షుడు శ్రీనివాసరావు, మండ ల ప్రధాన కార్యదర్శి చె న్నారెడ్డి, వర్కింగ్ మండల అధ్యక్షుడు బాలునాయక్, యూత్ వింగ్ మండల అధ్యక్షుడు ప్రకాశ్, మండల ప్రధాన కార్యదర్శి ముదిరాజ్, గిరిజన రాష్ట్ర నాయకులు లక్ష్మణ్‌నాయక్, జగన్నాయక్, సర్పంచ్ శంకర్, ఉ పసర్పంచ్ గిరధర్రావు, నాయకులు, రైజింగ్ స్టా ర్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.