రేవల్లి, ఏపిల్ 6 : తల్పునూర్ గ్రామానికి చెందిన ఎల్కాల బాలరాజు(59) శనివారం మధ్యాహ్నం మూడుగంటల సమయంలో బయటికి వెళ్లి వస్తానని తన కుమారుడికి చెప్పి వెళ్లాడు. రాత్రయినా తిరిగి ఇంటికి రాలేకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువుల ఇండ్లళ్లో వెతికినా ఆచూకీ లభించలేదు. బారాజు చేపలవేటకు వెళ్లి ఉంటాడని అనుమానంతో చిట్టెమ్మ చెరువు వద్దకు వెళ్లి చూడగా, శవమై కనిపించాడు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి మృతదేహాన్ని రేవల్లి ప్రభుత్వ దవాఖానకు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. మృతుడి తమ్ముడు తిరుపతయ్య ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్త్సె రాము పేర్కొన్నారు.