జడ్చర్ల, మార్చి 18 : మహబూబ్నగర్ జిల్లాలో దారుణం(Brutal murder) చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తిని దుండగులు బండరాళ్లతో మోదీ హతమార్చారు. ఈ విషాదకర సంఘటన జడ్చర్ల మున్సిపాలిటీలోని కావేరమ్మపేట కూరగాయల మార్కెట్ సమీపంలో చోటు చేసుకుంది. మార్కెట్ రోడ్డు పక్కన గుర్తుతెలియని వ్యక్తి (40)ని దారుణంగా హతమార్చారు.
మృతుడు తెలుపు రంగు డబ్బాల నీలం రంగు హాఫ్ షర్ట్, మెరూన్ కలర్ ఫుల్ డ్రాయర్ వేసుకున్నాడు. మెడలో రుద్రాక్షం కలిగిన కాషాయం దండ ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివాహేతర సంబంధమా? లేదా ఆర్థిక లావాదేవీల వల్ల హత్య చేశారా అనే కోణంలో విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.