కారేపల్లి, మార్చి 17 : కారేపల్లి మండల పరిధిలోని కోటమైసమ్మ దేవాలయం బ్రహ్మోత్సవాలు ఈ నెల 20 నుండి ప్రారంభం కానున్నట్లు ఆలయ చైర్మన్ పర్సా పట్టాభి రామారావు, ఈఓ కె.వేణుగోపాలాచార్యులు తెలిపారు. బ్రహ్మోత్సవాలు మూడు రోజుల పాటు కొనసాగనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పూజారి కొత్తలంక కైలాసశర్మ ఆధ్వర్యంలో అభిషేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయ ప్రాంగణంలో పలువురు వాహన పూజలు జరిపించుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు ఆలయ ప్రాంగణంలో దాతల సహకారంతో అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.