Mojtaba Khamenei | అమెరికా, ఇజ్రాయెల్‌పై ప్రతీకారమే లక్ష్యం.. కాల్పుల విరమణ లేదు.. మొజ్తాబా ఖమేనీ స్పష్టం
Mojtaba Khamenei : తమ దేశంపై దాడి చేసిన అమెరికా, ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకోవడమే లక్ష్యం అని ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేని స్పష్టం చేసినట్లు సమాచారం.
Mojtaba Khamenei : తమ దేశంపై దాడి చేసిన అమెరికా, ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకోవడమే లక్ష్యం అని ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేని స్పష్టం చేసినట్లు సమాచారం. ఖమేనికి సంబంధించిన వివరాలేవీ తెలియనప్పటికీ.. ఆయన మాత్రం ఇజ్రాయెల్, అమెరికాలపై ప్రతీకారంతోనే ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్‌లపై ప్రస్తుత యుద్ధ సమయంలో అనుసరించాల్సిన విధానంపై జరిగిన ఒక విధానపరమైన సమీక్షా సమావేశం సందర్భంగా ఖమేని ఈ మాటలు చెప్పినట్లు ఇరాన్ అధికార వర్గాలు తెలిపాయి.
అయితే, ఈ సమావేశానికి ఖమేని నేరుగా హాజరయ్యారా, లేదా అనే విషయంలో స్పష్టత లేదు. ఇరాన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. యుద్ధం ముదురుతున్న వేళ.. రెండు దేశాలతో కాల్పుల విరమణ, ఉద్రిక్తతలు తగ్గించే అంశంపై ఇరాన్ నేతలు ఖమేనితో చర్చలు జరిపారు. ఉద్రిక్తతలు తగ్గించి, శాంతి, కాల్పుల ఒప్పందం వంటి అంశాల్లో రెండు దేశాలు మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన కొన్ని ప్రతిపాదనల్ని ఇరాన్ నేతలు ఆయన ముందుంచారు. కానీ, ఖమేని మాత్రం వాటిని తిరస్కరించారు. అమెరికా, ఇజ్రాయెల్‌లపై ప్రతీకారమే తమ లక్ష్యమని, తమ దేశ పౌరుల్ని చంపిన వారి నుంచి తగిన పరిహారం పొందాల్సిందే అని ఖమేని స్పష్టం చేసినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు పరిమిత స్థాయిలోనే ప్రతీకార చర్యలకు దిగామని, అనుకున్నది సాధించేవరకు తమ చర్యలు కొనసాగుతాయని, అంతవరకు ఇది తమ ప్రాధాన్యంగా ఉంటుందని అయన స్పష్టం చేశారు.
ఇరాన్ ఎప్పటికీ వెనకడుగు వేయదని, ఎప్పటికీ ప్రతిఘటిస్తూనే ఉంటుందని ఖమేని అన్నారు. అయతొల్లా ఖమేని మరణానికే కాదని, ప్రతి ఇరాన్ పౌరుడి మరణానికి పూర్తి శక్తి సామర్ధ్యాలతో ప్రతీకారం తీర్చుకుంటామన్నారు. అయితే, ప్రస్తుతం ఖమేని ఎక్కడ ఉన్నారనేదానిపై స్పష్టత లేదు. ఆయన రష్యాలోని మాస్కోలో చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Imam Salary | మౌజన్.. ఇమామ్‌ల వేతనగోస.. ఏడు నెలలుగా 16,379 మంది ఎదురుచూపులు
Bigg Boss 10 | బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్‌కు త్రిగుణ్ వార్నింగ్.. షాలిని గురించి చెబుతూ ఎమోషనల్!
KRMB Meeting | కేఆర్ఎంబీ సమావేశం మళ్లీ వాయిదా.. ఇరు రాష్ర్టాలకు బోర్డు లేఖ
JEE Main | విద్యార్థులకు ఎన్టీఏ గుడ్‌న్యూస్.. ఇకపై ఒకే లాగిన్‌తో జేఈఈ రిజిస్ట్రేషన్
Harish Rao | గ్రావిటీతో నీళ్లా.. నిరూపిస్తే రాజీనామా? లేదంటే మీరు చేస్తారా ?.. సర్కార్‌కు హరీశ్ ఓపెన్ చాలెంజ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

