రైతులు దళారీలను ఆశ్రయించొద్దు
ఆరుగాలం కష్టపడి పండించిన మొక్కజొన్న ధాన్యాన్ని విక్రయించేందుకు దళారీలను ఆశ్రయించొద్దని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు రైతులకు సూచించారు. గురువారం అయిజ పట్టణంలోని సబ్ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మున్సిపల్ చైర్మన్ సీఎం సురేశ్‌తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు.
- అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు
- అయిజ పట్టణంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం
అయిజ, ఏప్రిల్ 9 : ఆరుగాలం కష్టపడి పండించిన మొక్కజొన్న ధాన్యాన్ని విక్రయించేందుకు దళారీలను ఆశ్రయించొద్దని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు రైతులకు సూచించారు. గురువారం అయిజ పట్టణంలోని సబ్ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మున్సిపల్ చైర్మన్ సీఎం సురేశ్‌తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు.
దళారులకు విక్రయించి రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం కొనుగోళ్లు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. కొనుగోళ్లు కేంద్రాల్లో సర్కారు నిర్ణయించిన రూ.2,400 మద్దతు ధర చెల్లిస్తుందన్నా రు. అలంపూర్ నియోజకవర్గంలో మొక్కజొన్న పండించిన రైతులు కొనుగోళ్లు కేంద్రాలను సద్వినియో గం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమం లో అలంపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్డప్ప, వైస్ చైర్మన్ కుమార్, డీఏవో వీరప్ప, మార్క్‌ఫెడ్ ఎండీ చంద్రమౌళి, ఏడీఏ సక్రియానాయక్, ఏవో జనార్దన్, పీఏసీసీఎస్ కార్యదర్శి మల్లేశ్, కౌన్సిలర్లు, ఏఈవోలు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

