మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్‌ను (Mahabubnagar) అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని ఏనుగొండ, రామదూత టౌన్షిప్ కాలనీలో ముడా నిధులు రూ.25 లక్షలతో నిర్మించనున్న అధునాతన పార్క్ నిర్మాణపు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ మున్సిపాలిటీగా ఉన్న మహబూబ్‌నగర్‌ను కార్పొరేషన్‌గా రూపాంతరం చేయడం జరిగిందని, నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవడం ఎంతో అవసరమన్నారు.
అందుకే నగరంలో అన్ని వార్డుల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. మార్పు ఇప్పుడే మొదలైందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, మహబూబ్ నగర్ ఫస్ట్ పర్యవేక్షకులు గుండా మనోహర్, నాయకులు సిజే బెనహార్, వెంకటేష్ గౌడ్, రామస్వామి, కిరణ్ కుమార్, ఇమ్మడి పురుషోత్తం, సిహెచ్ మంజుల, సీహెచ్ జ్యోతి, రఘురామిరెడ్డి, మురళీ గౌడ్, వెంకటయ్య , రమేష్, సీఎంఓ బాలు యాదవ్, రవికుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.