మద్దూర్, జూలై 20: మండలంలోని అన్ని గ్రామాల్లో మిషన్‌భగీరథ పనులను త్వరగా పూర్తిచేయాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మద్దూర్ పట్టణంలోని పలు వార్డుల్లో మిషన్‌భగీరథ పనులు పెండింగ్‌లో ఉండడంపై ఏఈ చెన్నయ్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మద్దూర్‌లోని ఆయాకాలనీల్లో పర్యటించి ప్రజల సమస్యలను ఆడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా వెంటనే తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తానన్నారు. ఆధికారులు సైతం ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించాలన్నారు. ముఖ్యంగా వానకాలం సీజన్లో మిషన్‌భగీరథ పైపులైన్లు లీకేజీ కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం మనఊరు -మనబడి కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో అదనపు గదులకు భూమిపూజ చేసి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థుల భవిష్యత్ కోసమే సీఎం కేసీఆర్ నాయకత్వంలో మన ఊరు -మన బడి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. అదేవిధంగా పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ పరిసరాలను పరిశీలించారు. బస్టాండ్ ఆవరణలో కంకర వేయాలని సూచించారు. దమగ్నాపూర్, మొమినాపూర్, దోరెపల్లి, వీరారం సబ్‌స్టేషన్ నిర్మాణానికి భూమి ఇచ్చిన దాతలకు సబ్‌స్టేషన్‌లో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఉద్యోగ నియామకపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ జిల్లా జిల్లా చైర్మన్ శాసం రామకృష్ణ, కోస్గి మార్కెట్ కమిటీ చైర్మన్ వీరారెడ్డి, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు పెద్ద వీరారెడ్డి, పీఏసీసీఎస్ చైర్మన్ జగదీశ్వర్, సర్పంచ్ అరుణ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకటయ్య, నాయకులు సలీం, బాల్సింగ్, శివకుమార్, వెంకట్రాములుగౌడ్, వీరేశ్‌గౌడ్, బసిరెడ్డి, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.