e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, August 1, 2021
Home జోగులాంబ(గద్వాల్) ఊహించని అభివృద్ధి

ఊహించని అభివృద్ధి

ఊహించని అభివృద్ధి
  • పదేండ్ల కిందట నీడ కోసం ఒక్క చెట్టు కూడా లేకుండె..
  • ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద కేసీఆర్‌ ఎకో అర్బన్‌ పార్క్‌
  • 2 కోట్ల విత్తన బంతులను వెదజల్లే కార్యక్రమంలో ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌
  • పాల్గొన్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఎంపీ మన్నె, ఎమ్మెల్యే ఆల

మహబూబ్‌నగర్‌, జూలై 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మహబూబ్‌నగర్‌ జిల్లా అభివృద్ధిలో దూసుకుపోతున్నదని గ్రీన్‌ ఛాలెంజ్‌ సృష్టికర్త, ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌ పేర్కొన్నారు. ఎక్సైజ్‌, పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి మహబూబ్‌నగర్‌ సమీపంలోని కేసీఆర్‌ ఎకో అర్బన్‌ పా ర్కులో పాలమూరు జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో కేవలం 10 రోజుల్లో తయారు చేసిన 2 కో ట్ల 8 లక్షల విత్తన బంతులను వెదజల్లే కార్యక్రమానికి హాజరయ్యారు. మహబూబ్‌నగర్‌-జడ్చర్ల జాతీ య రహదారికిరువైపులా, పాలమూరు విశ్వవిద్యాలయంలోనూ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నా రు. జిల్లా కేంద్రంలోని శ్రీనివాస కాలనీలో రూ.కోటి 42 లక్షలతో నిర్మించిన మున్సిపల్‌ పార్కును ప్రారంభించా రు. కలెక్టరేట్‌ వద్ద రూ.6 కోట్లతో నిర్మిస్తున్న సమీకృత మార్కెట్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కేసీఆర్‌ అర్బన్‌ ఎకో పార్కులో జింకల పార్కును సైతం ప్రారంభించారు. అంతకుముందు శ్రీనివాసకాలనీ పార్కు స మీపంలోని దేవాలయంలో పూజలు చేశారు. ఈ సం దర్భంగా ఎకో పార్కులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ మాట్లాడుతూ పదేండ్ల కిందట ‘నమస్తే తెలంగాణ’ కార్యాలయం ప్రారంభం సందర్భంగా మహబూబ్‌నగర్‌ వస్తే ఈ ప్రాంతంలో ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు నీడ కూడా లేని విధంగా ఉండేదన్నారు.

కనీసం ఒక చెట్టు కూడా కనిపించలేదన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఊహించని విధంగా మారిపోయిందన్నారు. పచ్చదనమే కనబడని పరిస్థితి నుంచి దేశంలోనే అతి పెద్దదైన 2,097 ఎకరాల్లో ఉన్న కేసీఆర్‌ ఎకో అర్బన్‌ పార్క్‌ కండ్ల ముందు సాక్షాత్కరించిందని తెలిపారు. ఎకో పార్కు చూడముచ్చటగా ఉందన్నారు. ఇంతగా పచ్చదనం పెరిగిపోతుందని ఊహించలేదన్నారు. మహబూబ్‌నగర్‌ను అన్ని రకాలుగా తీర్చిదిద్దుతున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను అభినందించారు. కేసీఆర్‌ పార్కును అభివృద్ధి చేయడంలో తన వంతు సహకారం అందిస్తానని, మంత్రి కోరినట్లు కొంతభాగాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. తనతో పాటు మిత్రుల సాయం తీసుకుని ఇంతటి అందమైన పార్కును మరింతగా ఆకట్టుకునేలా మార్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. హరిత పాలమూరుగా మారుస్తున్న మహిళా సంఘాల సభ్యులను కొనియాడారు. 10 రోజుల్లో 2 కోట్ల 8 లక్షల విత్తన బంతులు తయారుచేయడం మామూలు విషయం కాదన్నారు.

- Advertisement -

సమైక్య రాష్ట్రంలో పార్కులే లేవు : మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌
2014కు పూర్వం మహబూబ్‌నగర్‌లో ఒక్క పార్క్‌ కూడా లేదని, అలాంటిది ప్రస్తుతం దేశంలోనే అతిపెద్దదైన కేసీఆర్‌ అర్బన్‌ ఎకో పార్కును ఏర్పాటు చేశామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. ప్రతి ఒక్కరూ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని పిలుపునిచ్చారు. పార్కులోని అన్ని ప్రాంతాలను సందర్శించే విధంగా ట్రైన్‌ ఏర్పాటు చేసి.. జింకల పార్కు, అడ్వెంచర్‌ పార్క్‌, చిన్నపిల్లల పార్క్‌ వంటివి కూడా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. తెలంగాణ , క ర్ణాటక నుం చి పర్యాటకులు ఎ కో పార్కుకు వస్తున్నార న్నారు. పర్యాటకుల సంఖ్య పెరిగేందుకు అన్ని సౌకర్యాలు క ల్పిస్తామన్నారు. సమీపంలోనే ఉదండాపూర్‌ రిజర్వాయర్‌ సైతం పర్యాటకానికి అదనపు ఆకర్షణగా మారుతుందన్నా రు. పాలమూరులో కబ్జాల నుంచి కాపాడి అ నేక పార్కులను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా పచ్చదనాన్ని పెంపొందిస్తున్న ఎంపీ సంతోష్‌ కుమార్‌ కేసీఆర్‌ అర్బన్‌ ఎకో పార్కులో 100 ఎకరాలు దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని కోరారు.

కార్యక్రమంలో మహబూబ్‌నగర్‌ ఎంపీ మ న్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, కలెక్ట ర్‌ ఎస్‌.వెంకట్రావు, ఎస్పీ ఆర్‌.వెంకటేశ్వర్లు, అదనపు క లెక్టర్లు తేజస్‌ నందలాల్‌ పవార్‌, కె.సీతారామారావు, పీ యూ వీసీ లక్ష్మీకాంత్‌ రాథోడ్‌, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్‌ రాజేశ్వర్‌గౌడ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ కేసీ నర్సింహు లు, వైస్‌ చైర్మన్‌ గణేశ్‌, డీసీసీబీ ఉపాధ్యక్షుడు వెంకట య్య, మార్కెట్‌ కమిటీ మాజీ అధ్యక్షుడు రాజేశ్‌, డీఎఫ్‌ వో గంగిరెడ్డి, డీఆర్డీవో యాదయ్య, గ్రీన్‌ ఇండియా ప్ర తినిధులు రాఘవ, వెంకటేశ్‌, మున్సిపల్‌ మాజీ కమిషనర్‌ ప్రదీప్‌కుమార్‌, పీయూ రిజిస్ట్రార్‌ పిండి పవన్‌కుమార్‌, ఓఎస్డీ మధుసూదన్‌రెడ్డి, కౌన్సిలర్లు పవీణ్‌కుమార్‌, కట్టారవికిషన్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్‌ కృష్ణమోహన్‌, అధికారులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఊహించని అభివృద్ధి
ఊహించని అభివృద్ధి
ఊహించని అభివృద్ధి

ట్రెండింగ్‌

Advertisement