e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home జిల్లాలు స్వేచ్ఛ సంచారం

స్వేచ్ఛ సంచారం

స్వేచ్ఛ సంచారం

వన్యప్రాణులకు నిలయం నల్లమల
లాక్‌డౌన్‌తో అడవిలో సంచారం
తగ్గిన జన సంచారం, కాలుష్యం
అమ్రాబాద్‌, అచ్చంపేట రేంజ్‌ పరిధిలో 20 పులులు కెమెరాలో ట్రాప్‌

అచ్చంపేట, జూన్‌ 11 : నల్లమల అటవీ ప్రాం తం సకల జీవులకు నిలయంగా మారింది. ప్రభు త్వం విధించిన లాక్‌డౌన్‌ కారణంగా నల్లమలలో వన్యప్రాణులు స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. వాహనాల రాకపోకలు లేకపోవడంతో పులులు రోడ్లపై తిరుగుతున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్‌-శ్రీశైలం ప్రధాన రహదారి కావడంతో నిత్యం వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగించేవి. శ్రీశైలం పుణ్యక్షేత్రం, మల్లెలతీర్థం, మద్దిమడుగు వంటి పేరుగాంచిన ఆకట్టుకునే దైవక్షేత్రాలు ఉన్నందున పెద్దసంఖ్యలో యాత్రికులు, భ క్తులు వస్తుంటారు. దీంతో వన్యప్రాణులు అడవుల్లోనే ఉంటూ బయట పెద్దగా కనిపించేవి కావు. అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వు ఫారెస్టు కావడంతో ప్రతి రోజు ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే వాహనాలు లోపలికి అనుమతిస్తారు. మిగిలిన సమయాల్లో వచ్చే వాహనాలను మన్ననూ ర్‌, దోమలపెంట చెక్‌పోస్టుల వద్ద నిలిపివేసి మరుసటి రోజు ఉదయం పంపిస్తారు. రాత్రి వేళ వన్యప్రాణులు సంచరించనున్నందున వాహనాలను చెక్‌పోస్టుల వద్ద నిలిపివేస్తారు. సెలవు దినాల్లో పెద్దసంఖ్యలో వాహనాలు వస్తుంటాయి. అయితే, ప్రస్తు తం లాక్‌డౌన్‌ కారణంగా పుణ్యక్షేత్రాల సందర్శన లేనందున వాహనాల సందడి తగ్గింది. దీంతో వన్యప్రాణులు, పక్షులు అడవుల్లోనే ఉంటూ ప్రశాంతం గా తిరుగుతున్నాయి.

శబ్ధ, వాయు కాలుష్యం తగ్గడంతో వన్యప్రాణులు స్వేచ్ఛగా రోడ్లపైకి, నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో విహరిస్తున్నాయి. వన్యప్రాణులు సంచరించే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చే సి ఎలాంటి హాని జరగకుండా అటవీశాఖ అధికారులు భద్రతా చర్యలు చేపట్టారు. ప్రధానంగా పులు లు, చిరుతలు సంచరించే ప్రాంతాల్లో నిఘా ఏర్పా టు చేశారు. సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నా రు. కరోనా వైరస్‌ జంతువులకు సోకకుండా అన్ని చర్యలు చేపట్టారు. ప్రత్యేక సిబ్బందిని కేటాయించి నిత్యం పర్యవేక్షిస్తున్నారు. గతంలో వేసవిలో వన్యప్రాణులు అటవీ సమీప గ్రామాలకు వచ్చేవి. ఈ సారి ఎక్కడ కూడా వన్యప్రాణులు బయటకు వచ్చి న పరిస్థితి లేదు. అంటే అటవీప్రాంతంలో స్వేచ్ఛగా విహరించే వాతావరణం నెలకొనడంతో జంతువు లు, వన్యప్రాణులు బయటకు వచ్చే అవకాశాలు ఉండవని అధికారులు భావిస్తున్నారు. రోడ్లపై చిరుతలు, పులి, జింకలు, దుప్పులు గుంపులు గుంపులుగా కనిపిస్తున్నాయి. అడవిలోకి చెంచులను మినహా మరెవ్వరిని లోపలికి అనుమతించడంలేదు. జన సంచారం తగ్గి వన్యప్రాణుల సంతానోత్పత్తికి అనుకూల వాతావరణం ఏర్పడింది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు నల్లమల అటవీ ప్రాంతం ఆకుపచ్చగా చిగురిస్తుండగా.. నల్లమల ప్రాంతానికి అందమొచ్చింది.
స్వేచ్ఛగా తిరుగుతున్నాయి..
లాక్‌డౌన్‌ కారణంగా నల్లమలలో మంచి వాతావర ణం నెలకొనడంతోపాటు వాహనాల రద్దీ తగ్గడంతో వ న్యప్రాణులు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. అడవిలో 800 పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. వాటి ద్వారా వన్యప్రాణులను పర్యవేక్షిస్తున్నాం. సిబ్బందిని అప్రమత్తం చే సి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాం. అడవిలో 20 వరకు పులులు కెమెరాలో ట్రాప్‌ అయ్యాయి. 100కు పైగా చిరుతపులులు, 50వేలకు పైగా జింకలు, 20 వేల వరకు దుప్పులు, 5 వేలు నీల్‌గాయి, ఎలుగుబంట్లు, అడవికుక్కలు వందల సంఖ్యలో ఉన్నాయి. వన్యప్రాణుల సం తానోత్పతికి అనుకూల వాతావరణం ఉన్నది. జంతువులకు కరోనా వ్యాప్తించకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఫరహాబాద్‌, పుల్లాయపల్లి, దోమలపెంట, మద్దిమడుగు, భౌరాపూర్‌, వ్యూపాయింట్‌ ప్రాంతాల్లో పులులు, చిరుతలు తిరుగుతున్నాయి. సాసర్‌పిట్లలో నీళ్లు తాగుతున్నాయి. కోతులు జాన, ఈత పండ్లు తింటున్నాయి. ప్లాస్టిక్‌ కూడా తగ్గింది.
కృష్ణగౌడ్‌, జిల్లా అటవీశాఖ అధికారి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
స్వేచ్ఛ సంచారం

ట్రెండింగ్‌

Advertisement