e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home జిల్లాలు రంజాన్‌ కానుకలు పంపిణీ

రంజాన్‌ కానుకలు పంపిణీ

రంజాన్‌ కానుకలు పంపిణీ

కృష్ణ, మే 10 : మండలంలోని తాసిల్దార్‌ కార్యాలయంలో సోమవారం డిప్యూటీ తాసిల్దార్‌ కిరణకుమార్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు ముస్లింలకు రంజాన్‌ కానుకలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లింలు రంజాన్‌ పండుగను ఆనోందోత్సాహాల మధ్య జరుపుకోవాలన్న ఉద్దేశంతో రంజాన్‌ తోఫాలను అందజేస్తుందని అన్నా రు. కరోనా విస్తృతంగా వ్యాప్తిస్తున్న కారణంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, తప్పనిసరిగా మాస్కు ధరించాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు వెంకట్‌రెడ్డి పాటి ల్‌, శివప్ప, అబ్దుల్‌ ఖదీర్‌, మహదేవప్ప పాల్గొన్నారు.
వీజేఆర్‌ ప్రజాసేన ఆధ్వర్యంలో..
ఊట్కూర్‌, మే 10 : టీఆర్‌ఎస్‌ నాయకుడు వర్కటం జగన్నాథ్‌రెడ్డి స్థాపించిన వీజేఆర్‌ ప్రజా సేన ఆధ్వర్యంలో సోమవారం మండలంలోని పగిడిమర్రిలో ముస్లింలకు రంజాన్‌ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వర్కటం మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితిలో పేద ముస్లింలు రంజాన్‌ పండుగను సుఖ సంతోషాలతో జరుపుకోవాలనే ఉద్దేశంతో నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. 125 మందికి కిట్లు అందజేశామన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 800 కుటుంబాలకు రంజాన్‌ కిట్ల పంపిణీ చేపడుతామన్నా రు. ప్రతిఒక్కరూ మాస్కు ధరించాలని, భౌతికదూరం పాటి స్తూ కరోనాను ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. కార్యక్రమంలో అంజనారెడ్డి, మసీదు కమిటీ సభ్యులు ఉన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రంజాన్‌ కానుకలు పంపిణీ

ట్రెండింగ్‌

Advertisement