జడ్చర్ల టౌన్, ఏప్రిల్ 10 : ఈనెల 27వ తేదీన వరంగల్‌లో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవం తం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం జడ్చర్లలో ఆయన రజతోత్సవ సభకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర సాధన కోసం పుట్టి 14ఏండ్లు పోరాటం చేసి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించినట్లు తెలిపారు. సాధించిన తెలంగాణను కేసీఆర్ అభివృద్ధి పథంలో తీసుకెళ్లారన్నారు.
దేశంలో అన్నిరంగాల్లో నెంబర్‌వన్‌గా తీర్చిదిద్దారని గుర్తుచేశారు. పార్టీ 25వ వసంతంలోకి అడుగుపెడుతున్న తరుణంలో పండుగ వాతావరణంలో రజతోత్సవాన్ని నిర్వహించుకుంటున్నట్లు చెప్పారు. రజతోత్సవ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు తరలిరానున్నారని, జడ్చర్ల నియోజకవర్గం నుం చి దాదాపు 3వేల మంది ముఖ్య కార్యకర్తలు సభకు తరలివెళ్లేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామాల్లో వాల్‌పోస్టర్లు, వాల్రైటింగ్తో రజతోత్స వ వేడుక ప్రచారం జరుగుతున్నదన్నారు. అదేవిధంగా భవిష్యత్తులో మహబూబ్‌నగర్‌లో కేసీఆర్ సభ నిర్వహించనున్నట్లు లక్ష్మారెడ్డి తెలిపారు. అ నంతరం మండలంలోని గంగాపూర్‌లో బీ ఆర్ఎస్ రజతోత్సవ సభ వాల్‌రైటింగ్‌ను ప్రారంభించారు.