ఆత్మకూరు, నవంబర్ 5 : తెలంగాణలో పేదల తిరుపతిగా పే రుగాంచిన కురుమూర్తిస్వామి బ్ర హ్మోత్సవాలు అంగరంగవైభవంగా కొనసాగుతున్నాయి. వేడుకల్లో ప్రధాన ఘట్టమైన అలంకార మహోత్సవం బుధవారం జరగనున్నది. ఆత్మకూరు సంస్థానాధీశులు ముక్కెర వంశస్తులు బహూకరించిన బం గారు ఆభరణాలను స్వామివారికి అలంకరించ డం ప్రత్యేకత. శతాబ్ధాల నుంచి బ్రహ్మోత్సవాలకు, ఆత్మకూరుకు ఎనలేని అనుబంధం ఉన్నది. సంస్థానాధీశుల కాలం నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు, నిర్వహణ ప్రధాన ఘట్టాలన్నీ ఆత్మకూరు నుంచే నిర్వహిస్తూవచ్చారు. అలంకార మహోత్సవంలో భాగంగా ఆత్మకూరు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా నుంచి ఆరంభమయ్యే వేడుకను తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తారు. బ్యాంకు సురక్షిత లాకర్లో భద్రపరిచి న స్వామి స్వర్ణాభరణాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి బయటకు తీసుకొస్తారు. బ్యాంకు నుంచి కు రుమూర్తి కొండకు
చేరే వరకు నిర్వహించే ఆభరణాల ఊరేగింపులో గ్రామగ్రామానా ప్రజలు నీరాజనాలు పలుకుతారు. ఆత్మకూరు సంస్థానాధీశులైన ముక్కెర వంశరాజులు కురుమూర్తిస్వామి, లక్ష్మీదేవీలకు చేయించిన ఆభరణాలతోపాటు మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌రెడ్డి చేయించిన ఆభరణాలనూ శోభాయాత్రగా కొండమీదకు చేర్చనున్నారు.
ఆనవాయితీగా ఆభరణాల ఊరేగింపు..
ఆత్మకూరు ఎస్బీఐలో భద్రపరిచిన స్వర్ణాభరణాలను దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించి బయటకు తీసుకొస్తారు. స్థానిక విశ్వకర్మలు గాడి వంశస్తులు స్వర్ణాభరణాల పెట్టెను తలపై పెట్టుకొని పోలీసుల బందోబస్తు మధ్య పట్టణంలో ఊరేగింపు నిర్వహిస్తారు. చెరువుకట్టపైకి చేరగానే చెరువులోని పరమేశ్వరస్వామికి అభిముఖంగా ఆభరణాలను ఉంచి పూజలు చేస్తారు. పూజల అనంతరం ఆభరణాల పెట్టె ఆత్మకూరు నుంచి కొండగట్టుకు బయలుదేరుతుంది. ఆత్మకూరు నుంచి దుప్పల్లి మీదుగా ఊరేగింపు కొనసాగుతుంది. కురుమూర్తిరాయుడి సోదరుడైన బుగులు రాయుడు వెలిసిన దుప్పల్లిలో పూజలందుకొని సంస్థానాధీశులైన అమ్మాపురం రాజా స్వగృహానికి ఆభరణాలు చేరుకుంటాయి.
రాజావారి స్వగృహంలో ఆభరణాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుంచి సంస్థానాధీశులు ఆ ధ్వర్యంలో ఆభరణాలను కొండపైకి చే రుస్తారు. బ్రహ్మోత్సవాల్లోని ఘట్టాల న్నీ ఆది నుంచి ఆచార వ్యవహారంగానే కొనసాగుతున్నాయి. చిన్నచింతకుంట పల్లమర్రి గ్రామం నుంచి మ్యాదర్లచే చాట తయారీ, అప్పంపల్లి గ్రామం నుంచి కుమ్మరులచే కలికుండ, అ మరచింత నుంచి పద్మశాలీలచే ప ట్టువస్ర్తాలు, వడ్డెమాన్ గ్రామం నుంచి ద ళితులచే ఉద్దాల పాదుకల ఏ ర్పాట్లన్నీ ఆచార వ్యవహారంగానే కొనసాగుతాయి. బ్రహ్మత్సవాలను పురస్కరించుకొని ఆత్మకూరు పట్టణం శోభాయమానంగా ముస్తాబైంది. నాలుగురోజుల ముందుగానే సందడి మొదలవ్వడం తో కురుమూర్తి జాతర శోభ సంతరించుకుంది. ఇదిలా ఉండగా అలంకార మహోత్సవాన్ని శోభాయమానంగా నిర్వహించేందుకు మున్సిపాలిటీ ప్ర తినిధులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. సీఐ శివకుమార్, ఎస్సై నరేందర్ నేతృత్వంలో పోలీసులు రెండంచెల బందోబస్తు నిర్వహించేందుకు సమాయత్తమయ్యారు.