గండీడ్, జనవరి 30 : పరిగి నియోజకవర్గంలోని కుల్కచర్ల మండలం దాసానాయక్తండాలో ఫిబ్రవరి 1న నిర్వహించే సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రానున్నట్లు పరిగి మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి తెలిపారు. గురువారం గండీడ్ మండలకేంద్రంలో ఉమ్మడి మండల బీఆర్ఎస్ నాయకులతో ఆయన సమావేశం ఏర్పాటు చే శారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రా ష్ట్రంలో ప్రజాపాలన గాడి తప్పిందని, ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఈ రోజు ఏవిధమైన సమాధానం చెబుతుందన్నారు.
రైతు ప్రభుత్వం అంటూ రైతుల నడ్డి విరుస్తుందని స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నాలుగు పథకాలను ప్రారంభించి ప్రజలను మచ్చిక చేసుకునేందుకు కుట్రలు చేసింది తప్పా ప్రజలకు చేసిందేబీ లేదన్నారు. జనవరి 27 తెల్లారేసరికి అందరి ఖాతా లో రైతుభరోసా వేస్తామని చెప్పి తెల్లారేసరికి మాట మార్చి 2025 మార్చి 30 వరకు పొడిగించి మరోసారి తెలంగాణ ప్రజలను మోసం చేయడం తప్పా మరోటి కాదన్నారు.
శనివారం దాసానాయక్ తం డాలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరవుతున్న నేపథ్యంలో నిర్వహించే సమావేశానికి గ్రామస్తులు పెద్దసంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, ఉమ్మడి మండల అద్యక్షుడు పెంట్యానాయక్, భిక్షపతి, ఆయా గ్రామా ల మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.