నాగర్ కర్నూల్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR ) ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మాజీ శాసన సభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా విజయఢంకా మోగించిన బీఆర్ఎస్( BRS) పార్టీ సర్పంచులకు,ఉప సర్పంచులకు,వార్డు సభ్యులకు సన్మానం చేయనున్న కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాట్లను మాజీ శాసన సభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి పరిశీలించారు. కేటీఆర్కు ఘన స్వాగతం పలికేందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు . జిల్లాలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, కుటుంబ సభ్యులు అందరూ పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు.