మహబూబ్‌నగర్ (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/నాగర్‌కర్నూల్, డిసెంబర్ 28 : బీఆర్ఎస్ హయాంలో పాడిపంటలతో సస్యశ్యామలంగా ఉన్న పాలమూరును కాంగ్రెస్ ప్రభుత్వ వలసల జిల్లాగా మార్చుతుందని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. నిజంగా ఎవరైనా దుష్మన్ ఉన్నారు పాలమూరుకు అంటే.. నె ంబర్‌వన్ విలన్ కాంగ్రెస్ పార్టీనే అని విమర్శించారు. కాంగ్రెస్ ఎక్కడ ఉంటుందో.. అక్కడ ప్రో గ్రెస్ ఉండదని ఆయన ఆరోపించారు. ముం దుచూపుతో ప్రారంభించిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం పండపెట్టిందని విమర్శించారు. కేసీఆర్ హయాంలో ఈ ప్రాజెక్టు కోసం పిలిచిన టెండర్లను రద్దు చేసి పనులు పూర్తి చేయకుండా వదిలేశారని ఆరోపించారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేసి రైతులకు నీరందించేంత వరకు పారాటానికి సిద్ధమవుతామన్నారు.
నీటి కేటాయింపుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజీ పడుతున్నారని ఆరోపించారు. పాలమూరు రైతన్నలు ఆలోచించండి.. ‘ఏనుగు వెళ్లింది.. తోక చిక్కిం ది’ అన్నట్లు 35 వేల కోట్ల ప్రాజెక్టులో కేసీఆర్ ప్రభుత్వంలోనే రూ.28 వేలకు కోట్లు మనం ఖర్చు చేసి 90 శాతం ప్రాజెక్టు పనులు పూర్తి చేశామని తెలిపారు. ఈ రెండేండ్లలో కాల్వలు కూడా తవ్వేందుకు ప్రభుత్వానికి సమ యం దొరకడం లేదని ధ్వజమెత్తారు. ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయ ఆవరణలో జరిగిన కొత్త సర్పంచులకు ఆత్మీయ సన్మాన సభకు కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లయింది.. ఈ రెండేళ్లలో ఏమైందని ఆలోచిస్తే.. రాష్ట్రంలో రైతు బంధు పోయి.. రాబంధుల పాలన వచ్చిందని, యూరియా కోసం మళ్లీ రైతులు తిప్పలు పడుతున్నారని, చెప్పులు, ఆధార్‌కార్డులు, రాళ్లు క్యూలైన్లో పెట్టేరోజులు వచ్చాయని ఆవేదన చెందారు.
నాగర్‌కర్నూల్ జిల్లాలో పెద్దసంఖ్యలో సర్పంచ్, ఉప సర్పంచ్ స్థానాల్లో గెలుపొందడంపై కేటీఆర్ సంతోషం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. గెలిచిన సర్పంచ్‌లు, వార్డుసభ్యులు భయపడొద్దని, అధికార పార్టీ ఎమ్మెల్యేలు మిమ్మల్ని ఏం చేయలేరని ధైర్యం చెప్పారు. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు కళ్లు నెత్తిమీనికెక్కినై అని విమర్శించారు. ‘ఎవరైనా బీఆర్ ఏస్ సర్పంచులు వస్తే నా గేట్ కాడ నుంచి బయటికి మెడబట్టి నూకుతా’ అంటూ బెదిరిస్తున్నారు.. నేనొక్కటే మాట చెప్తున్నా.. మీరెవరు కూడా మీరు ఎవరికి మోతాదు కావద్దు..
మీరు ఎవరి మీద ఆధారపడి లేరు.. సర్పంచు లు ఒక విషయం అర్థం చేసుకోవాలి.. దేశంలో మీరు రక్షణగా ఉండేది అంబేద్కర్ రాసిన రాజ్యాంగమని, కాంగ్రెస్ ఎమ్మెల్యేల బెదిరింపులు మిమ్మల్ని ఏం చేయవని స్పష్టం చేశారు. రాష్ర్టానికి ముఖ్యమంత్రి ఎలా ఉంటాడో గ్రామానికి సర్పంచ్ అట్లానేనన్నారు. ఫైనాన్స్ కమిషన్ నిధులు నేరుగా గ్రామ పంచాయతీలకు వస్తాయన్నారు. ఐదు అం చెల ప్రభుత్వంలో అందరూ కలిసి మెలిసి పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ విధులు అందరూ తెలుసుకోవాలని, నూతనంగా గెలుపొందిన సర్పంచులు సుపరిపాలన అందించాలన్నారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసే వరకు కేసీఆర్ మరోసారి పోరాటానికి సిద్ధమయ్యారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్-బీజేపీ పార్టీలు చీకటి స్నేహం కొనసాగిస్తున్నాయని ఎద్దేవా చేశారు. పాడిపంటలతో సస్యశ్యామలంగా మారిన పాలమూరు జిల్లాను మళ్లీ వలసల జిల్లాగా మార్చిన ఘనత రేవంత్‌కే దక్కిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో 90శాతం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు పూర్తిచేస్తే కేవలం 10శాతం మిగిలిన పనులను చేపట్టలేకపోతుందన్నారు. రెండున్నరేండ్ల్లు కావస్తున్నా ఆ ప్రాజెక్టులో తట్టెడు మట్టి తీయలేకపోగా నీకృష్టపు మాట లు రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును కాపాడుకొని రైతన్నలకు అండగా నిలబడేందుకు, తెలంగాణ నీటి వాటాల ప్రయోజనాలను కాపాడేందుకు కేసీఆర్ మరోసారి పోరాటానికి సిద్ధమయ్యారన్నారు. త్వరలో పాలమూరుకు కేసీఆర్ రాబోతున్నారని, ఆయన చేయబోయే పోరాటానికి పాలమూరు బిడ్డలంతా అండగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు.
నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో ప్రతిపక్షం లో ఉన్నా బీఆర్ఎస్ నాయకులు వీరోచిత పోరాటం చేసి 50శాతం సర్పంచ్ స్థానాల ను కైవసం చేసుకున్నామని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. ఆదివారం నా గర్‌కర్నూల్, అచ్చంపేట నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలుపొంది న సర్పంచ్, ఉప స ర్పంచులకు పార్టీ కా ర్యాలయంలో ఏర్పా టు చేసిన ఆత్మీయ స న్మాన కార్యక్రమంలో ఆ యన మాట్లాడారు.
అచ్చంపేట, నాగర్‌కర్నూల్‌లో ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ అత్యధిక స ర్పంచ్ స్థానాలను కైవసం చేసుకున్నామని, పార్టీ నాయకులు వీరోచిత పోరాటం వల్లనే ఇదిసాధ్యమై ందని సంతృప్తి వ్యక్తం చేశారు. నాగర్‌కర్నూల్ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే సొంతూరు తూడుకుర్తిలో కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయినా గెలిచినంత సంతృప్తినిచ్చిందన్నారు. అ క్కడ మాజీ ఎంపీపీ నర్సింహారెడ్డి వీరోచితంగా పోరాటం చేశారని అభినందిస్తూ కేటీఆర్‌తో ప్రత్యేకంగా సన్మానం చేయించారు. ఇలా చాలా గ్రామాల్లో కొద్దిపాటి ఓట్ల తేడా తో ఉన్నప్పటికీ గెలిచినంత తృప్తి కలుగుతు ందన్నారు.
ఏగ్రామంలో చూసినా తమ పా ర్టీకి చెందిన వారు ఇద్దరు ముగ్గురు పోటీలో ఉండడంతో ఓట్లు చీలిపోయి కాంగ్రెస్ వా రు గెలుపొందడం జరిగిందన్నారు. కొన్ని గ్రామాల్లో గెలిచినవా డు, రెండు, మూడు స్థానాల్లో ఉన్నవారు మన పార్టీ వారే ఉ న్నారన్నారు. ఇలా పోటీపడి బరిలో ఉ ండడంతో కొన్ని గ్రామాల్లో తక్కు వ ఓట్లతో ఓట మి చెందారన్నా రు. ఇప్పటికైనా గ్రామాల్లో నాయకులు, కార్యకర్తలు పట్టింపులకుపోయి అవతలి వాడి గెలుపునకు కారకులు కావద్దని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ చాలా గ్రామాల్లో బీఆర్ఎస్ గట్టి పోటీనిచ్చిందన్నారు. మున్ముందు వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఒక్కతాటిపై ఉండి అత్యధిక స్థానాలను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకునేలా కృషి చేయాలని మర్రి కార్యకర్తలకు పిలుపునిచ్చారు.