గద్వాల, సెప్టెంబర్ 17 : జిల్లాకేంద్రంలో గద్వాల గర్జన పేరు మీద నిర్వహించిన కేటీఆర్ సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్ నియోజకవర్గ నేతల్లో కల్లోలం మొ దలైంది. తాము ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకే ప్రజలు మ ద్దతు ఇస్తారని భావించిన ఇక్కడి అధికార పార్టీ నేతలకు స్థానికులు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. పార్టీలోకి నా యకులు వస్తుంటారు.. పోతుంటారు.. కానీ పార్టీకి కా ర్యకర్తలే ముఖ్యమనే విషయం బీఆర్ఎస్ సభ సక్సెస్‌తో ఇక్కడి హస్తం పార్టీ నేతలకు అర్థమైనట్లు ఉన్నది.
అయితే బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరిన నేతలు.. భవిష్యత్‌లో తమ పరిస్థితి ఏమిటో అనే ఆలోచనలో ఉ న్నట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీలి పోయి ‘ఎవరికి వారే యమునా తీరే’ అనే చందంగా మారిపోవడంతో విసుగు చెందిన కార్యకర్తలు వారి దారి వారు చూసుకుంటున్నారు. ఇది బీఆర్ఎస్కు కలి సి వచ్చింది. గద్వాలలో రామన్న పర్యటనతో బీఆర్ ఎస్‌లో జోష్ పెరగగా.. అధికార పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఇక ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున వలసలు గులాబీ గూటికి ఉండనున్నట్లు తెలుస్తోన్నది.
బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే బండ్ల కాంగ్రెస్‌కు మద్దతు తెలపడం, అధిష్టానం ఆయనకు అధిక ప్రాధా న్యం ఇస్తుడండంతో జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. మొదటి నుంచి పార్టీ కోసం పని చేసిన సరిత వర్గానికి ప్రాధాన్యత ఇవ్వక పోవడంతో ఇక కాంగ్రెస్‌లో ఉంటే తమ ఉనికికే ప్రమాదమని భావించిన కొందరు నేతలు ఒక్కొ క్కరుగా పార్టీని వీడుతున్నారు. 2023లో జరిగిన సాధా రణ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన మాజీ మున్సిపల్ చైర్మన్ కేశవ్‌తోపాటు 17 మంది కౌన్సిలర్లు గతంలో చేరారు. తర్వాత ఎమ్మెల్యే బండ్ల అధికార పార్టీలోకి వెళ్లడంతో ఆయనకు మద్దతు తెలియజేయగా.. కాంగ్రెస్‌లోనే రెండు వర్గాలుగా కౌన్సి లర్లు, నాయకులు విడిపోయారు.
అంతేకాకుండా సరిత వర్గీయులకు అధిష్టానం సరైన ప్రియారిటీ ఇవ్వకపోడంతో కొందరు మాజీ కౌన్సిలర్లు ఎమ్మెల్యే పంచన చేరారు. అయితే ఉన్నవారినైనా అధిష్టానం కాపాడుకోవడంలో నిర్లక్ష్యం వహించడంతో విసుగు చెందిన ముఖ్య నాయకులు సైతం ఆ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరారు. సరిత వర్గ ంలోని మాజీ మున్సిపల్ చైర్మన్ కేశవ్‌తోపాటు ఆయన వెంట ఉన్న ఎనిమిది మంది మాజీ కౌన్సిలర్లు కారె క్కారు. ఇది సరిత వర్గానికి ఊహించని షాక్.
ఇక ఎమ్మె ల్యే వర్గంలో ఉన్న ధరూర్ మాజీ జెడ్పీటీసీ దంపతులు పద్మావెంకటేశ్వరరెడ్డి తమకు ఎమ్మెల్యే తగిన ప్రాధా న్యం ఇవ్వడం లేదని గుర్తించారు. అందుకే ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇలా సరిత, ఎమ్మెల్యే బండ్ల వర్గాల నుంచి నాయకులు పార్టీ మారడంతో బీఆర్ఎస్కు మరింత బలం చేకూ రింది. అధిష్టానంపై సరిత వర్గీయులు గుర్రుగా ఉన్నట్లు తెలిసింది. నామినేటెడ్ పదవులు ఎమ్మెల్యే వర్గానికి దక్కడంతో, కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన తమ కు నిరాశే మిగిలిందని సరిత వర్గీయులు మండి పడుతున్నారట.
సరిత పార్టీ మారితే కాంగ్రెస్ పార్టీకి పెద్ద నష్టం జరు గుతుందని భావించిన నేతలు ఆమెకు పదవుల ఆశ చూపి ఊరిస్తున్నారు. రెండు నెలల కిందట జిల్లా కేం ద్రంలోని హరిత హోటల్లో ఏర్పాటు చేసిన సమా వేశానికి కాంగ్రెస్ పరిశీలకులు హాజరయ్యారు. ఆ సమావేశంలో రెండు రోజుల్లో సరితకు తీపి కబురు వస్తుందని, ఎవరూ ఆందో ళన చెందాల్సిన అవసరం లేదని చెప్పి వెళ్లారు. మాట చెప్పి రెండు నెలలు దాటినా ఇచ్చిన హామీని అధిష్టానం నిలుపుకోలేకపోయింది. పార్టీలో మా నేతకు ఇచ్చిన హామీలకే దిక్కు లేదు.. ఇక మాకు అధిష్టానం ఏం న్యాయం చేస్తుందని భావించి కాంగ్రెస్‌లో ఉంటే తమకు భవిష్యత్ ఉండదనే ఆలోచనతో కాంగ్రెస్‌లో ఉన్న చాలా మంది నేతలు బీఆర్ఎస్ చేరగా మరి కొందరు నేతలు పార్టీలో
చేరడానికి క్యూ కడుతున్నారు.
కాంగ్రెస్ అధిష్టానికి తలనొప్పిగా గద్వాల కాంగ్రెస్ రాజకీయం మారింది. ఓ వైపు నేను బీఆర్ఎస్లో ఉన్నానని చెబుతున్న ఎమ్మెల్యే బండ్ల మాత్రం అధికార పార్టీ పరిశీలకులు హాజరైన సమావేశాల్లో పాల్గొంటున్నారు. దీన్ని సరిత వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. కాగా ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి తాను బీఆర్ఎస్లోనే ఉన్నానని చెబుతుండగా.. కాంగ్రెస్ పరిశీలకులతో, కార్యకర్తలతో సమావేశం ఎందుకు ఏర్పాటు చేశారని ప్రశ్నించారు.
అటు సరిత, ఇటు ఎమ్మెల్యే వర్గాల మధ్య విభేదాలు ముదరడంతో ఇక్కడికి మంత్రులు, పరిశీలకులు రావాలంటే జంకుతున్నారు. గద్వాలకు వచ్చిన కాంగ్రెస్ నేతలు, మంత్రులు ఎవరైనా రెండు వర్గాలు ఏర్పాటు చేసిన సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాల్సిన పరిస్థితి. ఇది వారికి తలనొప్పిగా మారింది. దీంతో గద్వాల కాంగ్రెస్ రాజకీయాలు అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. గద్వాలలో కాంగ్రెస్‌లో ఉన్న గ్రూపు తగాదాలు బీఆర్ఎస్కు కలిసి రావడంతో ఇక గద్వాల నియోజకవర్గంలో కారు
పార్టీకి తిరుగులేదు. ఏ ఎన్నికలు వచ్చినా గద్వాల కోటపై గులాబీ జెండా ఎగరడం ఖాయమన్న ధీమా పార్టీ వర్గాల్లో కనిపిస్తున్నది.