తిమ్మాజిపేట, సెప్టెంబర్ 19 : నాగర్‌కర్నూల్ జిల్లా ఆవంచలో గురువారం మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి శ్వేతారెడ్డి ఏకాదశదినకర్మలో పలువురు నాయకులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, రాజ్యసభ సభ్యులు దీవకొండ దామోదర్‌రావు గురువారం గ్రామానికి చేరుకొని శ్వేతారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. లక్ష్మారెడ్డిని పరామర్శించారు.
వారితోపాటు మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, మహమూద్ అలీ, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, బాల్క సుమన్, రవీందర్రావు, గువ్వల బాలరాజు, జైపాల్ యాదవ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి, మాజీ ఎంపీలు మం దా జగన్నాథ్, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు గెల్లు శ్రీనివాస్, రజినీసాయిచంద్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తదిరులు శ్వేతారెడ్డికి నివాళులర్పించారు. ముఖ్య నేతల రాకతో స్థానికులు, బీఆర్ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.