పాలమూరు, ఆగస్టు 4 : సీఎం కేసీఆర్ రైతులకు రుణమాఫీ ప్రకటించిన సందర్భంగా మహబూబ్‌నగర్ రూర ల్ మండలం ఫత్తేపూర్లోని వ్యవసా య మార్కెట్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి మార్కట్ కమిటీ చైర్మన్ రహమాన్ రైతులతో కలిసి క్షీరాభిషేకం చే శారు. అదేవిధంగా ఫత్తేపూర్‌లో రైతు లు క్షీరాభిషేకం చేస్తూ కేసీఆర్ ప్రభు త్వం మళ్లీ రావాలని నినాదాలు చేశా రు. కార్యక్రమంలో వైస్‌చైర్మన్ గిరిధర్‌రెడ్డి, డైరెక్టర్లు రాములు, సాయిలు, సర్పంచ్ అలివేలు, రైతులు పాల్గొన్నారు.
హన్వాడలో..
హన్వాడ, ఆగస్టు 4 : రైతులకు రుణామాఫీని సీఎం కేసీఆర్ ప్రకటించిన సందర్భంగా శుక్రవారం మండలంలోని వేపూర్, సల్లోనిపల్లి, గొండ్యాల, టంకర, కొత్తపేట గ్రామాల్లో సీఎం కేసీఆర్, మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. రైతుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని పలువురు కొనియాడారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, రైతులు ఉన్నారు.
దాయపంతులపల్లిలో
నవాబ్‌పేట, ఆగస్టు 4 : మండలంలోని దాయపంతులపల్లిలో శుక్రవారం బీఆర్ఎస్ నాయకులు సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతిగా ముద్ర వేసుకున్నారని తెలిపారు. కార్యక్రమంలో ముడా డైరెక్టర్ చెన్నయ్య, సర్పంచ్ లలితమ్మ, ఉపసర్పంచ్ సత్యం, నాయకులు తిరుపతయ్య, కృష్ణయ్య, కుమార్, దశరథంగౌడ్, పాండయ్య పాల్గొన్నారు.