దేవరకద్ర, జూన్ 23 : జిల్లాలోని భారీ నీటిపారుదల ప్రాజెక్టు అయిన కోయిల్‌సాగర్‌కు రెండ్రోజులుగా కృష్ణా జలాలు చేరుతున్నా యి. ఫలితంగా ప్రాజెక్టులో నీటిమట్టం క్రమంగా పెరుగుతున్నది. రెండ్రోజుల కిందట మరికల్ మండలం తీలేరు పంప్‌హౌస్ నుంచి రెండు మోటర్ల ద్వారా 315 క్యూసెకుల నీటిని కోయిల్‌సాగర్‌కు నా రాయణపేట ఎమ్మెల్యే విడుదల చేశారు. దీంతో కాల్వల ద్వారా కృ ష్ణమ్మ పరుగులు పెడుతూ ప్రాజెక్టులోకి వచ్చి చేరుతున్నది. కోయిల్‌సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 32.5 అడుగులు కాగా ఆదివారం సాయంత్రం నాటికి 13.1 అడుగులకు చేరింది. దీంతో ప్రాజెక్ట్ జలకళను సంతరించుకున్నది. కృష్ణాజలాలు వచ్చి చేరుతుండడంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.