మహబూబ్‌నగర్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీఆర్ఎస్ ఆవిర్భావ, రజతోత్సవ వేడుకలకు సిద్ధంగా కావాలని పార్టీ అధినేత కేసీఆర్ ఉమ్మడి జిల్లా ముఖ్యనేతలకు సూచించారు. ఈనెల
27న నిర్వహించనున్న బీఆర్ఎస్ ఆవిర్భావ, రజతోత్సవ మహాసభ సన్నాహక సమావేశాన్ని పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన శనివారం హైదరాబాద్‌లోని ఎర్రవల్లి నివాసంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు మహబూబ్‌నగర్, వనపర్తి, నారాయణపేట, గద్వాల, నాగర్‌కర్నూల్ జిల్లాల ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ రజతోత్సవ వేడుకలో పాలమూరు సత్తా చాటాలని.. భారీ ఎత్తున జనసమీకరణతోపాటు గ్రామాల్లో పార్టీ వేడుకలు ఘనంగా నిర్వహించాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
సమావేశంలో మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, హర్షవర్ధన్‌రెడ్డి, అంజయ్యయాదవ్, జైపాల్‌యాదవ్, పట్నం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా పార్టీ ముఖ్య నేతలు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, గట్టుయాదవ్, ఆంజనేయగౌడ్, హన్మంతు నాయుడుతోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.