బాలానగర్/రాజాపూర్, జూన్ 1 : తెలంగాణ రాష్ర్టానికి కేసీఆర్ శ్రీరామరక్ష అని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. రాజాపూర్ మండలం అంజమ్మతండాలో మాజీ జెడ్పీటీసీ మోహన్‌నాయక్ తనయుడు గోవర్ధన్‌నాయక్ పెండ్ల్లి వేడుకల్లో భాగంగా ఆదివారం ఏర్పాటు చేసిన విందుకు మాజీ మంత్రులు హరీశ్‌రావు, లక్ష్మారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ రహదారిపై పెద్దాయపల్లి స్టేజీ వద్ద బాలానగర్ మండల బీఆర్ఎస్ నాయకులు గోపాల్‌రెడ్డి, చెన్నారెడ్డి, గణేశ్‌గౌడ్, వెంకటాచారి, శ్రీనివాసరావు, శ్రీకాంత్‌రెడ్డి, సమీఉల్లా, రవి పటాకులు కాల్చి..పుష్పగుచ్ఛాలతో ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం శాలువాలు, పూలమాలలతో మాజీ మంత్రులు హరీశ్‌రావు, లక్ష్మారెడ్డిలను సన్మానించారు. రంగారెడ్డిగూడ స్టేజీ వద్ద రాజాపూర్ మండల నాయకులు అభిమన్యురెడ్డి, డీసీఎమ్మెస్ చైర్మన్ పట్ల ప్రభాకర్‌రెడ్డి, శ్రీశైలంయాదవ్, అన్మగళ్ల నర్సింహులు, గంగాధర్‌గౌడ్, శ్రీనివాసరెడ్డి హరీశ్‌రావుకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నాయకులు ఆయనను శాలువాలు, పూలమాలలతో సన్మానించారు.