గద్వాల, సెప్టెంబర్ 29 : నడిగడ్డలో అనుమతిలేని కల్లు దుకాణాలతో పాటు అనుమతి ఉన్న దుకాణా ల్లో కల్తీ కల్లు తయారీ విచ్చల విడిగా సాగుతోంది. క ల్లు తాగిన వారు ఇల్లుగుల్ల చేసుకుంటుండగా కల్లు తయారీ దారులు మాత్రం కోట్లకు పడగలెత్తుతున్నారు. నడిగడ్డ కల్లు తయారీకి పేరెన్నికగన్నది. ఇక్కడ ఈత చెట్లు తక్కువగా ఉన్నా.. కల్లు మాత్రం విచ్చల విడిగా తయారవుతున్నది. కల్తీ కల్లు తయారీదారులపై ఎక్సైజ్ అధికారు లు దాడులు చేసి కేసులు నమోదు చేసే క్ర మంలో రాజకీయ నాయకులు ఒత్తిళ్లతో కేసులు నమోదు కాకుండా చూడడంతో నడిగడ్డలో కల్తీ కల్లు వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతున్నది.
గద్వాల నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరు కొనసాగుతుంది. అయితే రెండు వర్గాలు ఒకరికి తెలియకుండా ఒకరు రాష్ట్రంలోని ఎక్సైజ్, పోలీస్‌శాఖ అధికారులకు అపరిచితుల ద్వారా సమాచారం ఇస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేస్తుండడంతో కల్తీకల్లు విక్రయదారులు హడలెత్తుతున్నారు. మూడు నెలల కాలంలో మూడు సార్లు గద్వాల నియోజకవర్గంలోనే దాడులు చేయడం దాడులు చేసిన ప్రతిసారి నిషేధిత కల్లు దొరకడం జరుగుతున్నది. దీంతో ఏ స్థాయిలో కల్తీకల్లు ఇక్కడ తయారు చేస్తున్నారో తెలిసి పోతుంది.
నడిగడ్డలో కల్లు దుకాణాలపై దాడులు చేస్తున్న కొద్ది కల్లులో వినియోగించే మత్తు పదార్థాలు లభ్యమవుతూనే ఉన్నాయి. జూలై చివరి వారంలో గద్వాల నియోజకవర్గంలోని మల్దకల్ మండల కేంద్రంలో నిషేధిత మత్తు పదార్థాలతో కృత్రిమంగా కల్లు తయారు చేస్తున్నార ని పక్కా సమాచారంతో యాంటీనార్కోటెక్ బ్యూరో దాడులు నిర్వహించడంతో కల్తీ కల్లు తయారు చేసే మాఫియా ఒక్కసారిగా ఉలి క్కి పడింది. ఆ దాడుల్లో ప్రమాదకర అల్ఫాజోలంతోపాటు శాక్రీ న్ వినియోగిస్తున్నట్లు పరీక్షల్లో తేలగా అక్కడ అధికారులు కల్లు దుకాణాన్ని సీజ్ చేశారు.
అదేవిధంగా ముగ్గురిపై కేసులు కూడా నమోదు చేశారు. ఆ ఘటన మరువకముందే ఆగస్టు 24న గద్వాల నియోజకవర్గ పరిధిలోని రంగాపురం, పాతపాలెంలో ని ఓ కల్లు దుకాణంలో కల్తీ కల్లు విక్రయిస్తున్నారే సమాచారంతో గద్వాల ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు రెండు కిలోల నిషేధిత సీహెచ్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నప్పటికీ రాజకీయ ఒత్తిళ్లతో ఆ సమాచారాన్ని బయటకు పొక్కకుండా ఎక్సైజ్ అధికారులు గోప్యంగా ఉంచారు. చివరికి ఈ విషయం బ యటకు పొక్కడంతో విధిలేని పరిస్థితిలో ఆ శాఖ అధికారు లు దాడులు చేసిన మాట వాస్తవమే అని.. దొరికిన సీహెచ్ ను సీజ్ చేయడంతోపాటు కల్లును ధ్వంసం చేసి 24 సీసాలను సీజ్ చేసి పరీక్షకు పంపినట్లు చెప్పారు.
ఇక్కడ అధికార పార్టీకి చెందిన ఓ నేత కనుసన్నల్లో కల్తీ కల్లు దందా కొనసాగుతున్నట్లు తెలిసింది. అధికార పార్టీలో రెండు వర్గాలుగా చీలి ఉండడండతో ఈ కల్తీ కల్లు దందా వ్యవహారం బయట కు వస్తున్నట్లు తెలుస్తుంది. జిల్లాలో మొత్తం మూడు వందలకుపైగా కల్లు దుకాణాలు ఉండగా.. అందులో రాజకీయ పలుకుబడితో వందకు పైగా అనుమతి లేని కల్లు దుకాణాలు నడుస్తున్నట్లు సమాచారం. ఈ విషయం ఆ శాఖ అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కొన్నేండ్ల నుంచి రాజకీయ అండదండలతో నడిగడ్డలో కృత్రిమ కల్లు తయారు చేసి అమాయక ప్రజల ప్రాణాలతో కల్లు తయారీ దారులు చెలగాటమాడుతున్నారు. కల్తీకల్లు తయారీదారులు మా త్రం రూ.కోట్లకు పడగలెత్తుతున్నారు. కల్లు తాగిన వారు మాత్రం తమ ఇల్లు గుల్ల చేసుకుంటున్నారు. ఈ విషయం అబ్కారీశాఖ అధికారులకు తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొన్నది. ప్రభుత్వం డ్రగ్స్ వాడకంపై కఠినంగా వ్యవహరిస్తుండడంతో నిషేధిత మత్తు మందుల సరఫరాదారుల వివరాలు బహిర్గతం అవుతున్నాయి. జూలై లో హైదరాబాద్‌లో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించడంతో గద్వాలలో కూడా మత్తు పదార్థాలతో కల్తీ కల్లు విక్రయిస్తున్నారని గుర్తించి దాడులు చేసినట్లు తెలుస్తున్నది. సాధారణంగా కల్లు తయారీకి సీహెచ్‌ను వినియోగిస్తారు.
ప్రస్తుతం దీనిపై నిషేధం ఉన్నది. ఒక కిలో సీహెచ్తో 3 నుంచి నాలుగు కేసుల కల్లు తయారు చేసేందుకు వీ లు ఉంటుందని, కానీ అధికారుల దాడుల్లో బయట పడుతున్న నిషేధిత మత్తు మందు ఒక గ్రాముతో 35 నుంచి 40 కేసుల కల్లును తయారు చేయవచ్చని ఇది సీహెచ్ కొద్ది ఎక్కువగా మత్తు ఇస్తుండంతో దీనిని వినియోగించి కల్తీ కల్లు త యారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ప్రమాదమని తెలిసినా ధనార్జనే ధ్యేయంగా కల్లులో మత్తు పదార్థాలను కలుపుతూ తమ దందా ను కల్లు తయారీ దారులు కొనసాగిస్తున్నారు. మల్దకల్ మండల కేంద్రంలో గత నెలలో నార్కోటెక్ డ్రగ్స్ అధికారులు దాడులు చేసి కల్లులో మత్తు పదార్థాలు వినియోగిస్తున్నట్లు గుర్తించి ముగ్గురుపై కేసులు నమోదు చేశారు.
ఆగస్టు నెలలో ధరూర్ మండలం పాతపాలెం కల్లు డిపోలో సీహెచ్ లభ్యం కాగా కల్లు డిపో నడిపే వ్యక్తిపై ఆబ్కారీ శాఖ అధికారులు కేసు నమోదు చేశారు. ఇక్కడ కల్లు విక్రయించే అధికార పార్టీ నేతపై గతంలో జడ్చర్ల, కర్నూల్, గద్వాల తదితర ప్రాంతాల్లో కేసులు నమోదైనప్పటికీ తనకున్న రాజకీయ పలుకుబడితో ఈ దందాను కొనసాగిస్తున్నాడని తెలుసున్నది. ఈ నెల 27న నార్కోటెక్ అధికారులు కేసులు నమోదు చేయగా అస లు సూత్రదారులు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. ఇప్పటికైనా ఆబ్కారీ శాఖ అధికారులు స్పందించి నడిగడ్డలో కృత్రిమ కల్తీ కల్లు తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వా రిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
గద్వాలలో కల్తీ కల్లు తయారీదారులపై నార్కోటెక్ అధికారులు నిఘా ఉంచారు. ఈ నెల 27న గద్వాల నియోజకవర్గంలోని గద్వాల మండలం జమ్మిచేడు, వీరాపురం, మేలచెర్వు, పూడూరు, మల్దకల్ మండలంలో ఏక కాలంలో నార్కోటెక్ అధికారులు పోలీసుల సహకారంతో కల్లు దుకాణాలపై దాడులు నిర్వహించారు. అక్కడ కల్లు విక్రయిస్తున్న వారి నుంచి నమూనాలు సేకరించి వైద్య పరీక్షలు నిర్వహించారు.
అయితే ఆయా గ్రామాల్లో విక్రయించే కల్లులో నిషేధిత మత్తు పదార్థాలు కలిపినట్లు గుర్తించారు. దీంతో ఆయా కల్లు దుకాణాలో ఉన్న 200 సీసాల నిషేధిత కల్లు సీసాలను స్వాధీనం చేసుకొని నిషేధిత మత్తు పదార్థాలు కలిపి కల్లు విక్రయిస్తున్న 20 మందిపై ఎన్డీపీఎస్ (నార్కోటెక్ డ్రగ్ సైకోట్రోఫిక్ పదార్థాల చట్టం) కింద కేసులు నమోదు చేశారు. ఈ దాడుల్లో రూ.15,600 నగదును కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.