పెబ్బేరు, ఏప్రిల్ 18 : పక్క ఫొటోలో కనిపిస్తున్నది జూరాల ప్రాజెక్టుకు చెందిన ప్రధాన ఎడమ కాల్వ. ఇ ది కాల్వ అంటున్నారు కానీ.. దాని ఆనవాళ్లు ఇక్క డ కనిపించడం లేదని అంటున్నారా? నిజమే రైతులకు జీవధార అయిన ఎడమ కాల్వ దు స్థితి ఇది. కాల్వ నిండా భారీ చెట్లు పెరిగి అసలు కాల్వనే కనిపించ కుండా పో తున్నా.. ప్రభుత్వం మాత్రం నిద్ర లేవట్లేదు. వేలాది ఎకరాలకు సాగు నీరు అందించే జూరాల కాల్వల పరిస్థితి ఇది. పెబ్బేరు మండలం మీదుగా ప్రధాన ఎడ మ కాల్వ పారుతోంది. దాని కింది పలు డిస్ట్రి బ్యూటరీలు, మైనర్ కాల్వల ద్వారా పంటలకు సా గునీరు అందుతోంది.
కాల్వలకు చాలా చోట్ల గండ్లు పడటం, ఇరువైపులా ఉన్న గోడలు, లైనింగ్ దెబ్బ తినడం, కాల్వలో మట్టి, రాళ్లు పేరుకుపోవడంతో నీళ్లు సరిగా ముందుకు వెళ్లకపోవడమే గాకుండా, పలు సంద ర్భాల్లో అవి తెగిపోతున్నాయి. ముఖ్యంగా ప్రధాన ఎడమ కాల్వ పరిస్థితి మరీ దారుణంగా ఉన్నది. కొన్ని చోట్ల కా ల్వకు ఇరువైపులా ఉన్న గోడలకు పెద్ద ఎత్తున చెట్లు పెరిగా యి. కాల్వ ఏ మాత్రం కనిపించని పరిస్థితి నెలకొన్నది. నీటి ప్రవాహానికి ఈ చెట్లు అడ్డు తగుతులున్నాయి. వాస్తవానికి కాల్వ గోడలకు పెరిగిన చెట్లను ఎప్పటికప్పుడు తొలగించాల్సి ఉం టుంది. అలా తొలగిస్తేనే కాల్వ గోడలు దెబ్బతినకుండా ఎ క్కువ కాలం మనుగడ సాగిస్తాయి. ప్రభుత్వం ఏ మా త్రం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నా యి. ఇప్పటికైనా మరమ్మతుల ఊసే ఎత్తడం లేదు.
ప్రతి వేసవికాలంలో జూరాల ఆయకట్టుకు అధికారులు విరామాన్ని ప్రకటిస్తారు. ప్రాజెక్టులో నీటి నిల్వలు లేకపోవడంతో రైతులు ఎవరూ పంటలు వేసుకోవద్దని సూచిస్తారు. దీంతో నీటి సరఫరాను పూర్తిగా నిలిపి వేస్తారు. మూడు, నాలుగు నెలల పాటు జూరాలకు సంబంధించి ఏ చిన్న కాల్వలోనూ చుక్క నీరు కనిపించదు. ఈ సమయంలోనే మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఉంది. కానీ, క్షేత్రస్థాయిలో అది జరగటం లేదు. ప్రమాదకరంగా తయారైన చోట్లను గుర్తించి వాటిని సరి చేయాల్సిన బాధ్యతను ప్రభుత్వం మరిచిపోయింది.
ప్రతి యేటా జూరాల ప్రాజెక్టు అధికారులు కాల్వల మరమ్మతుల కోసం అంచనాలు తయారు చేసి పంపుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కంటి తుడుపుగా కొన్ని నిధులు మంజూరు చేసి చేతులు దులుపుకొంటున్నారు. దీంతో ప్రధాన సమస్యలు పెరిగి పెద్దవవుతున్నాయి. దీంతో కాల్వల మనుగడే ప్రశ్నార్థకమైంది. ఈ విషయంలో అధికారులు సైతం చేతులెత్తేస్తున్నారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే తప్పా మరమ్మతులు చేయించలేమని వారు చెబుతున్నారు. ప్రభుత్వ తీరుపై ఆయకట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం కాల్వలను పర్యవేక్షిస్తూ లోటుపాట్లను సరిచేయాల్సిన బాధ్యతను విస్మరిస్తుండంపై వారు ఆక్షేపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని కాల్వలకు మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.