మక్తల్ : రాష్ట్రంలో గొల్ల కురుమ యాదవులను ఆదుకున్నది కేసీఆర్ ( KCR ) ప్రభుత్వమేనని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి (Chittem Rammohan Reddy) అన్నారు. సోమవారం మక్తల్( Maktal ) మండలం కర్ని గ్రామంలో బీరప్ప బండారు మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో సంబండ వర్గాలు అభ్యున్నతి సాధించాలని లక్ష్యంతో, కేసీఆర్ ప్రతి గొల్ల, కురుమ యాదవులకు ఉచిత గొర్రె పిల్లలను పంపిణీ చేశారని తెలిపారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన వచ్చి 16 నెలల్లో దాటినా కులవృత్తిదారులకు ఎలాంటి ప్రాధాన్యత కల్పించకుండ పరిపాలనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాని పాలనతో వ్యవసాయా రంగాన్ని సర్వనాశనం చేస్తున్నారని దుయ్యబట్టారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమాను వ్యక్తం చేశారు. ఆయన వెంట పార్టీ అధ్యక్షులు మైపాల్ రెడ్డి, నాయకులు రాజుల ఆశి రెడ్డి, గాల్రెడ్డిగంగాధర్, నరసింహారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.