జడ్చర్ల, అక్టోబర్ 20 : కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించినందుకు బాధ్యత వహిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలని జెడ్పీ మాజీ వైస్‌చైర్మన్ యాదయ్య, బాదేపల్లి పీఏసీసీఎస్ అధ్యక్షుడు చైర్మన్ సుదర్శన్‌గౌడ్ డిమాండ్ చేశారు. రైతులకు రైతు భరోసా నిధులను ఎగవేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు జడ్చర్లలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం జడ్చర్లలోని సిగ్నల్‌గడ్డ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం జడ్చర్ల తాసీల్దార్ కార్యాలయం ఎదుట కూడా నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ పాల్గొని వానకాలం పంటకు రైతు భరోసా నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రఘుపతిరెడ్డి, మాజీ ఎంపీపీ నర్సిములు, మాజీ మార్కెట్ చైర్మన్లు గోవర్ధన్‌రెడ్డి, మురళి, వైస్చైర్మన్లు శ్రీశైలంయాదవ్, దానీశ్, కౌన్సిలర్లు మహేశ్, లత, ప్రశాంత్‌రెడ్డి, మాజీ సర్పంచులు బచ్చిరెడ్డి, ప్రణీల్, రామకృష్ణారెడ్డి, రవీందర్‌రెడ్డి, నర్సింహులు, ముడా డైరక్టర్లు ఇంతియాజ్‌ఖాన్, రామ్మోహన్, కరాటేశ్రీను, బా లు, హఫీజ్, నాగిరెడ్డి, శంకర్‌నాయక్, గిరియాదవ్ తదితరులు ఉన్నారు.
మహబూబ్‌నగర్, అక్టోబర్ 20 : రైతులకు రైతుభరోసా కింద పంటకు రూ.7,500 చొప్పున రెండు సార్లు రూ.15000 అందజేస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి నేడు రైతుభరోసా ఇవ్వలేమని చేతులెత్తేసి రైతులకు తీరని అన్యాయం చేసిందని మహబూబ్‌నగర్ గ్రంథాలయాల సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్ ఆరోపించారు. మండలంలోని కోడూర్లో ఆదివారం రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పిలుపుమేరకు రైతుభరోసా అమలు చేయాలని ధర్నా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కాం గ్రెస్ పార్టీ పూటకోమాట మాట్లాడుతూ రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. రైతుభరోసా ఇస్తామని చెప్పిన ప్రభుత్వం నేడు వానకాలం పంటకు ఇవ్వలేమని, యాసంగికి చెల్లిస్తామ ని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల పేర్కొనడం దారుణం అన్నారు. రుణమాఫీ కూడా అందరికీ అమలు చేస్తామని 48 శాతం మందికి అమలు చేసి మిగతా వారికి అనేక ఆంక్షలు పెట్టి నిలిపివేసిందని దుయ్యబట్టారు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయలేని అసమర్థ సీఎం, మంత్రులు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కాడం ఆంజనేయులు, సింగిల్ విండో డైరెక్టర్ రాజేశ్వర్‌రెడ్డి, మం డల పార్టీ అధ్యక్షుడు మల్లు దేవేందర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ సుధాశ్రీ, రైతు సంఘం అధ్యక్షుడు నర్సయ్యగౌడ్, కృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీకాంత్‌గౌడ్, జెడ్పీ కోఆప్షన్ మాజీ మెంబర్ అల్లావుద్దీన్, నర్సిం హ, రాఘవేందర్‌గౌడ్, డీసీసీబీ డైరెక్టర్ నర్సింహులు, సింగిల్ విండో డైరెక్టర్ కృష్ణయ్యగౌడ్, చిన్నయ్యగౌడ్, రామాంజనేయులుతోపాటు మాజీ స ర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మహ్మదాబాద్/గండీడ్, అక్టోబర్ 20 : ఎన్నికలకు ముందు రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చిన నేడు రైతు భరోసా ఇవ్వలేమని మాటమార్చిన సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే గద్దె దిగాలని ఉమ్మడి గండీడ్, మహ్మదాబాద్ మండలాల బీఆర్ఎస్ నా యకులు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రె సిడెంట్ కేటీఆర్, మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి పిలుపు మేరకు రైతులందరికీ వానకాలం పంట నుంచే రైతుభరోసా ఇ వ్వాలని డిమాండ్ చేస్తూ ఆదివారం మండలంలోని దేశాయిపల్లి ఎక్స్‌రోడ్డులో బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, మాజీ సర్పంచ్ వెంకట్రాంరెడ్డి, రైతు సమన్వయ సమితి గండీడ్ మండల అధ్యక్షుడు ఉప్పరి గోపాల్, రాం చంద్రారెడ్డి, కిష్టయ్య, వెంకటయ్య, వెంకట్‌రెడ్డి, మాజీ సర్పంచ్ రఘు, సూర్యానాయక్, సాబేర్, నరేశ్, వెంకట్రాములు, అంజిలయ్య, బాలాజీ, నీలేశ్, రవీందర్‌నాయక్, ఆంజనేయులు, శ్రీనివాస్‌రెడ్డితోపాటు ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.
బాలానగర్, అక్టోబర్ 20 : కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో రైతులకు భరోసా ఇచ్చితీరాల్సిందేనని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వాల్యానాయక్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు ఆదివారం బాలానగర్ మండల కేం ద్రంలో బీఆర్ఎస్ నాయకులు రైతుభరోసా అమ లు చేయాలని ఆందోళన నిర్వహించారు. ఉదయం 11 గంటలకు మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు పూనుకోగా ఎస్సై తిరుపాజీ ఆధ్వర్యంలో పోలీసులు రంగప్రవేశం చేసి నా యకుల ఆందోళనకు అభ్యంతరం తెలిపారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ స్థానిక మండల పరిషత్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహ నం చేసేందుకు నిప్పంటించగా దిష్టిబొమ్మను పోలీసులు లా క్కున్నారు. దీంతో మరో దిష్టిబొమ్మను బీఆర్ఎస్ నాయకులు దహనం చేశారు. కార్యక్రమంలో కార్యదర్శి కిషన్‌నాయక్, అధికార ప్రతినిధి అరుణ్‌కుమార్, నాగేందర్, రవినాయక్, తిరుపతినాయక్, భూపాల్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, శ్రీధర్‌గౌడ్, రాజునాయక్, రథన్రాథోడ్, సేవ్యానాయక్, తెప్పమణి, శిరీశ్, శ్రీనూనాయక్ పాల్గొన్నారు.
దేవరకద్ర రూరల్(కౌకుంట్ల), అక్టోబర్ 20 : కాంగ్రెస్ ప్రభు త్వంవానకాలం సీజన్లో రైతుభరోసా ఇవ్వకుండా తాత్సారం చేసి పంటలు కోసే సమయంలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు రైతుభరోసా ఇవ్వలేమని ప్రకటించడంపై రైతులు భగ్గుమంటున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పిలుపుమేరకు ప్రభు త్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆదివారం చిన్నచింతకుంట మండలం ఫర్దిపూర్లో బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కోట రాముతోపాటు గ్రామ నాయకులు, రైతులు పాల్గొన్నారు. అలాగే చిన్న చింతకుంట, కౌకుంట్ల మండలకేంద్రాల్లో బీఆర్ఎస్ నాయకులు నిరసనలు చేపట్టారు.
దేవరకద్ర, అక్టోబర్ 20 : రైతులకు పంట పెట్టుబడి సాయం అందించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తున్నదని పీఏసీసీఎస్ అధ్యక్షుడు డోకూర్ నరేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జెట్టి నర్సింహారెడ్డి అన్నారు. రైతులకు రైతు భరోసా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం మండలకేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు, రైతులు నిరసన కార్యక్రమం చేపట్టా రు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు శ్రీకాంత్‌యాదవ్, కొండారెడ్డి, దొబ్బలి ఆంజనేయులు, బాలరాజు, రమేశ్ గౌడ్, వెంకటేశ్వర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, శ్యాంమ్సుందర్రెడ్డి, తిరుపతిరెడ్డి, మజరోద్దీన్ , ఖాజా, కృష్ణ, కరుణాకర్ తదితరులు ఉన్నారు.
మరికల్, అక్టోబర్ 20 : కేసీఆర్ సర్కారులో రైతును రాజు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం నట్టేట ముం చుతుందని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తిరుతపయ్య విమర్శించారు. ఆదివారం మండల కేంద్రంలోని అంతరాష్ట్ర రహదారిపై రాస్తారోకో చేపట్టారు. రైతుభరోసా ఇచ్చే వరకు రేవంత్ సర్కారు వదిలేదని లేదని తేల్చిచెప్పారు. కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ రవికుమార్, బీఆర్ఎస్ మండల కార్యదర్శి కృష్ణారెడ్డి, నాయకులు కొండారెడ్డి, గోవర్ధన్, అశోక్, కృష్ణయ్య, హన్మంతు, ప్రకాశ్, మోహ న్, వీరరాఘవరెడ్డి, రవి, హుస్సేన్, విష్ణుకాంత్‌రెడ్డి, రామేశ్వర్రె డ్డి, మురళి, నర్సింహులు, అనంత్‌రెడ్డి పాల్గొన్నారు.
ధన్వాడ, అక్టోబర్ 20 : సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రైతుభరోసా ఇవ్వాలని, రోజుకోరకంగా మాట్లాడి రైతుల పొట్టకొట్టడం తగదని మాజీ జెడ్పీటీసీ వెంకట్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సుదీర్కుమార్రావు, సునీల్‌కుమార్ రెడ్డి, నారాయణరెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, సత్యనారాయణగౌడ్, మురళీధర్ రెడ్డి, రమేశ్, ఇర్ఫాన్, శాంతికుమా ర్, నారాయణనాయక్ తదితరులు పాల్గొన్నారు.
నవాబ్‌పేట, అక్టోబర్ 20 : రైతు బంధు అందజేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైన నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆదేశానుసారం నవాబ్‌పేట మండల కేంద్రంలోని బస్టాం డ్ చౌరస్తాలో ఆదివారం నాడు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డికి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ బీఆర్ఎస్ నాయకులు బస్టాండ్‌లోని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మాడెమోని నర్సిములు, మాజీ జెడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ శీనయ్య, నాయకులు గోపాల్‌గౌడ్, సంతోష్‌రెడ్డి, చందర్‌నాయక్, తాహే ర్, అబ్దు ల్లా, రఘు, కృష్ణగౌడ్, బాలకిష్టయ్య, శశిధర్‌రెడ్డి, మెండె శ్రీను, నవనీతరావు, హన్మంతు, నర్సింహులు, వెంకటేశ్, శ్రీనివాస్‌రెడ్డి, సంజీవరెడ్డి, శేఖర్‌రెడ్డి, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.
మిడ్జిల్, అక్టోబర్ 20 : కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాకు రాంరాం పలకడాన్ని నిరసిస్తూ ఆదివా రం మిడ్జిల్‌లో కల్వకుర్తి-జడ్చర్ల ప్రధాన రహదారిపై ఆదివారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పాండు, జిల్లా నాయకుడు సుధాబాల్రెడ్డిలు మాట్లాడుతూ కాంగ్రె స్ నాయకులు ఎన్నికలకు ముందు రైతులకు అనేక హామీలను ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చాక ఒక్కక్కటి దాటవేస్తున్నదని, ముఖ్యంగా రైతులకు రైతుభరోసా ఇవ్వకుండా మోసం చేస్తున్నందని మండిపడ్డారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు బాలు, శ్రీనివాస్‌గౌడ్, జంగారెడ్డి, ప్రతాప్‌రెడ్డి, శ్రీనివాసులు, చెన్నయ్య, కాడయ్య, మతిన్, ఎల్లయ్యయాదవ్, జగన్‌గౌడ్, భిక్షపతి, వరుణ్‌రాజ్, శేఖర్, బంగారు, భాస్కర్, లక్ష్మణ్, మల్లేశ్, వెంకటయ్య, సుకుమార్, గోపాల్, శ్రీనివాసులు, రాములు, సురేశ్ పాల్గొన్నారు.
నారాయణపేట, అక్టోబర్ 20 : ప్రస్తుత పంట కాలానికి రైతుభరోసాను ప్రభుత్వం వెంటనే ఇవ్వాలని, రైతులను మోసం చేస్తే సహించేది లేదని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వేపూరి రాములు, పట్టణ ప్రధాన కార్యదర్శి చెన్నారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని సత్యనారాయణ చౌరస్తాలో పట్టణ, మండల పార్టీల అధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు సుదర్శన్‌రెడ్డి, జగదీశ్, లక్ష్మీకాంత్, గురులింగ్, రాములు, మల్రెడ్డి, వెంకట్రాములు, బోయలక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
దామరగిద్ద, అక్టోబర్ 20 : రైతుభరోసా వెంటనే రైతులకు ఇవ్వాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆది వారం మండల కేంద్రంలో రాస్తారోకో, ధర్నా నిర్వ హించారు. కార్యక్రమంలో మాలల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు హన్మంతు, మాజీ ఎంపీపీలు బక్క నర్స ప్ప, వెంకట్‌రెడ్డి, భీమయ్యగౌడ్, మాజీ వైస్ ఎంపీపీ దామోదర్‌రెడ్డి, మాజీ సర్పంచులు తిప్పన్న, సుభా ష్, నాయకులు చంద్రకాంత్, వెంకట్‌రెడ్డి తదిత రులు పాల్గొన్నారు.
కోస్గి, అక్టోబర్ 20 : స్థానిక శివాజీ చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టా రు. ఈ సందర్భంగా గ్రంథాలయసంస్థ జిల్లా మాజీ చైర్మన్ రామకృష్ణ మాట్లాడుతూ రైతులకు ఇవ్వాల్సిన రైతుభరోసా ఇవ్వకుండా ప్రభుత్వం చేతగాన్నితనాన్ని నిరూపించుకున్నదన్నారు. అంతకుముం దు అంబేద్కర్ చౌరస్తాలో నిరసన తెలిపారు. కార్యక్రమంలో నాయకులు వెంకట్ నర్సింహులు, సా యిలు, జనార్దన్‌రెడ్డి, సాయప్ప, రాజశేఖర్‌రెడ్డి, పోశ ప్ప, మోహన్‌గౌడ్, ఆనంతయ్య పాల్గొన్నారు.
హన్వాడ, అక్టోబర్ 20 : వానకాలం రైతులకు రైతు భరోసా డబ్బులు ఇవ్వాల్సిందే అని బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు రైతులకు ప్రభుత్వం వానకాలం రైతు భరోసా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆదివారం బీఆర్ఎస్ శ్రేణులు తాండూర్- మహబూబ్‌నగర్ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బాలరాజు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కరుణకర్గౌడ్, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు హరిచందర్, మాజీ వైస్‌ఎంపీపీ లక్ష్మయ్య, మాజీ సర్పంచులు చెన్న య్య, వెంకన్న, మాజీ ఎంపీటీసీలు చెన్నయ్య, మాల్కయ్య, మాజీ జెడ్పీటీసీ నరేందర్, నాయకులు జంబులయ్య, శ్రీనివాసులు, శివకుమార్, బసిరెడ్డి, ఖాజాగౌడ్, ఆంజనేయులు, మాధవులు, రామ్గౌడ్తోపాటు వివధ గ్రామాల రైతులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్, అక్టోబర్ 20 : వానకాలం పంటకు రైతులకు రైతుభరోసా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం కోయిలకొండ మండలకేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు ఆందోళన నిర్వహించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, కృషతోపాటు మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు పాల్గొన్నారు.
ఊటూర్, అక్టోబర్ 20 : కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే రైతు భరోసాను అమలు చేసి ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఎకరాకు రూ.15 వేలు పెట్టుబడి సహాయం అందజేయాలని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ రైతు భరోసా ఎగవేతపై ఆదివా రం మక్తల్ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన నిరసన కార్యక్రమానికి మండలంలోని అన్ని గ్రామాల నుం చి బీఆర్ఎస్ నాయకులు, రైతులు తరలివెళ్లారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తరుణ్‌రెడ్డి, ఆనంద్‌రెడ్డి, నర్సింహులుగౌడ్, బాలప్ప, భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.