మహబూబ్‌నగర్ కలెక్టరేట్, జూన్ 29 : నిరుపేద, అనాథ బాలికల కోసం ప్రభుత్వం ప్రతి మండలంలో కస్తూర్భా బాలికల విద్యాలయం (కేజీబీవీ) ఏర్పాటు చేసింది. ఇంటర్‌కు విద్య అందిస్తున్న కేజీబీవీల్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మెరుగైన వసతులతో పాటు నాణ్యమైన విద్య అందించడం, పదో తరగతిలో మెరుగైన ఫలితాలు వస్తుండటం తో కేజీబీవీలకు ఆదరణ పెరుగుతోంది. ఉమ్మ డి జిల్లావ్యాప్తంగా 72 కస్తూర్భాగాంధీ బాలి కా విద్యాలయాలు ఉండగా జిల్లాల వారీగా పరిశీలిస్తే మహబూబ్‌నగర్ జిల్లాలో 14, నా గర్‌కర్నూల్-20, వనపర్తి-15, జోగుళాంబ-గద్వాల-12, నారాయణపేట జిల్లాలో 11 కేజీబీవీలు ఉన్నాయి.
మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగుళాంబ-గద్వాల, నారాయణపేట జిల్లా ల్లో ఉన్న నిరుపేద, అనాథ బాలికల వివరాలను ఉపాధ్యాయులు, సీఆర్పీల సహకారం తో అధికారులు సేకరిస్తున్నారు. గుర్తించిన బాలికలకు 2025-26 విద్యా సంవత్సరానికి గానూ ప్రవేశాలు కల్పిస్తున్నారు. ప్రతి కేజీబీవీలో 6వ తరగతిలో 40 సీట్లు, ఇంటర్ మొ దటి సంవత్సరంలో ప్రతి గ్రూపులో 40 చొ ప్పున సీట్లు, అలాగే మిగిలిన తరగతుల్లో సై తం ఖాళీలుంటే ప్రవేశాలు చేపడతారు. మ హబూబ్‌నగర్ జిల్లాలోని రాజాపూర్, సీసీకుంట, మిడ్జిల్, భూత్పూరు మండలాల్లోని కేజీబీవీలతో పాటు ఉమ్మడి జిల్లాలో మరికొన్నింట్లో నూతనంగా ఇంటర్ విద్యను ప్రవేశ పెట్టినా.. అందుకు సంబంధించిన ఇప్పటి వ రకు అధ్యాపకులు, సిబ్బంది నియామకాలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టలేదు.
విద్యార్థినీలంతా నిరుపేద, అనాథ బాలికలు కావడంతో వారికి ఉపాధిపరంగా భరోసా ఇ చ్చేందుకు కేంద్ర ప్రభుత్వ సమగ్ర శిక్ష పథకం ద్వారా బ్యూటీ అండ్ వెల్నెస్, ఐటీ-ఐటీఈఎస్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్), వ్యవసాయం, హెల్త్ కేర్, కుట్టు శిక్షణ, దుస్తుల తయారీ తదితర వృత్తివిద్యలో శిక్షణ ఇస్తున్నారు. ఎంపికైన విద్యార్థులు ఆధార్‌కార్డు, బోనఫైడ్, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రం కేజీబీవీల్లో నేరుగా దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. తల్లిదండ్రులు లేని అనాథలకు, తల్లి లేదా తండ్రి లేని వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు. ఆ తర్వాత మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఈ ఏడాది నుంచి కేజీబీవీలో కొత్త మెనూ అమలు చేయనున్నారు. కేజీబీవీలో సీటు లభిస్తే వసతి కల్పించడంతో పాటు ఉచితంగా నాణ్యమైన విద్య, పుస్తకాలు, నోట్ పుస్తకా లు, దుస్తులు, కాస్మోటిక్ చార్జీలు, ఆహారం అందిస్తారు. ఉదయం టామాటా కిచిడీ, రా గిజావ, ఇడ్లి, సాంబార్, బూస్ట్ పాలు, ఉ ప్మా, పూరి, పురిహోర, బోండా, చపాతీ, జీ రారైస్, అరటి పండు, మధ్యాహ్నం అన్నంతో పాటు టమాట పప్పు, నెయ్యి, రసం, పెరు గు, ఉడిగించిన గుడ్డు, చికెన్, మటన్, సా యంత్రం ఉడికిని పెసలు, శనగలు, ఎగ్‌బజ్జీ, బెల్లం-పల్లీలు, అల్లం చాయ్, మిల్లెట్ బిస్కె ట్లు, పకోడి, రాత్రి అన్నంతో పాటు వివిధ రకాల కూరలు, సాంబార్, బట్టర్ మిల్క్ వంటివి ఆహార పట్టికలో పొందుపర్చారు.
ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరంలో అడ్మిషన్ కు నేరుగా, కళాశాలలో దరఖా స్తు చేసుకోవాలి. ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతుంది. సీట్లు భర్తీ అయ్యే వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. తరగతులు ప్రారంభం అయ్యాయి. మంచి ఫలితాలు సాధిస్తుండటంతో ప్రవేశాలకు డిమాండ్ ఉంది.
– ప్రవీణ్‌కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి, మహబూబ్‌నగర్