అలంపూర్ చౌరస్తా, జూలై 31 : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూ ర్తిగా కమీషన్ల పాలన సాగిసుంద ని ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డు మంజూరులో నిరుపేదల వద్ద పెద్ద మొత్తంతో కాంగ్రెస్ నాయకులు డబ్బులు వసూలు చేస్తున్నారని అ లంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఆరోపించారు. దీంతో ఎమ్మెల్యే విజయుడు కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య రసాభాస సాగింది. మహిళ శక్తి సం ఘాల సంబురాల్లో భాగంగా గురువారం ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తాలో ఒక ప్రైవేట్ ఫంక్షన్హాల్లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి వాకిటి శ్రీహరితోపాటు ఎ మ్మెల్యే హాజరయ్యారు.
అయితే మొదటగా వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ దొడ్డప్ప మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో రేషన్‌కార్డులు ఇవ్వలేదని విమర్శించారు. దీంతో ఎమ్మెల్యే విజయుడు ఒక్కసారిగా లేచి మైక్ తీసుకుని మాట్లాడుతూ ప్రొటోకాల్ పాటించకుండా ఇష్టానూనుసా రం కార్యక్రమం నిర్వహిచడం సరికాదని ప్రోటోకాల్ ప్రకారం మొదట ఎమ్మెల్యే, అనంతరం మం త్రి మట్లాడాల్సి ఉండగా మార్కెట్ యార్డు చైర్మన్‌కు ఎలా మైక్ ఇస్తారంటూ ఎమ్మెల్యే అధికారులపై అగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేసిన కాంగ్రెస్ నాయకుల మాటలకు ఎమ్మెల్యే గరంగరమయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రేషన్‌కార్డులకు ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని, ఇందిరమ్మ ఇంటి నిర్మాణా లు చేసుకుంటున్న నిరుపేదల వద్ద కాంగ్రెస్ నాయకులు కమీషన్లు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. డబ్బులు లేక అప్పులు చేసుకుని ఇండ్లు కట్టుకుంటుంటే బిల్లులు రావాలంటే కమీషన్లు ఇవ్వాలని పేద ప్రజల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.
అలంపూర్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వాన్ని అడ్డంగా పెట్టుకుని ప్రతి రోజు అక్రమంగా మట్టి, ఇసుక దం దాలు సాగిస్తున్నారని సభలోనే మంత్రి శ్రీహరి ముందు ఎమ్మెల్యే విజయుడు ఆరోపించారు. దీంతో కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే విజయుడితో వాగ్వాదానికి దిగారు. ఇరువర్గాల మధ్య మా టలయుద్ధం కొనసాగడంతో ఇరు పార్టీల నాయకులకు డీఎస్పీ మొగులయ్య సర్ధిచెప్పేందుకు ప్ర యత్నించినా ఫలితం లేకపోయింది. అనంతరం మంత్రి మైక్ అందుకొని మాట్లాడడంతో సమస్య సద్దుమణిగింది.
కాంగ్రెస్ పాలనపై దుమ్మెత్తి పోసిన మహిళ
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 20 నెలలు గడుస్తు న్నా ఇచ్చిన హామీలు నేరవేర్చలేదని, బూటకపు హామీలతో ప్రజలను నమ్మించి ప్రభుత్వ ఏర్పాటు చేసుకుందామని అలంపూర్ మండలం క్యాతూర్ గ్రామానికి చెందిన శిరిష అనే మహిళ కాంగ్రెస్ ప్ర భుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గ్రామాల్లో రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇండ్లలో భారీగా అవినీతి జరుగుతుందని అన్నారు.
కాంగ్రెస్ ప్రభు త్వం ప్రవేశపెట్టిన ఏ పథకాలు ప్రజలకు చేరడం లేదని ఆరోపించింది. కాంగ్రెస్ పాలనలో లంచం లేనిదే పనులు జరగడం లేదని కార్యాలయాల్లో కూడా లంచాలు లేనిదే అధికారులు పనులు చే యడం లేదని ఆరోపించారు. పింఛన్ రూ.4వేలు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు తులం బంగారం, మహిళలకు రూ.2,500 వేలు ఇస్తామని ప్రభుత్వం మాయమాటలు చెప్పి క్వార్టర్ సీసాకు ఓట్లు వేయించుకుని గద్దెనెక్కిందని శిరిష దుమ్మెత్తిపోశారు.
కాంగ్రెస్ కార్యకర్తలకే ప్రభుత్వ పథకాలు
ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు మాకు ఎవరికీ అందడం లేదని ఎమ్మెల్యే విజయుడు ముందు మహిళలు మొరపెట్టుకున్నారు. గురువారం ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తాలో మహిళ శక్తి సంబురాల్లో భాగంగా సభకు వచ్చిన మహిళలు సభ అనంతరం ఎమ్మెల్యే విజయుడు ముందు తమ సమస్యలను వివరించారు. కాంగ్రెస్ కార్యకర్తలకే ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని సా మాన్య ప్రజలకు పథకాలు అందడం లేదని వాపోయారు. దీంతో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ప్రభుత్వంలో అర్హులకు పథకాలు రావని అన్నారు. రా బోయే రోజుల్లో మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం వస్తుందని, అప్పుడు అందరికీ అన్ని పథకాలు అందుతాయని భరోసా ఇచ్చారు.