మహబూబ్‌నగర్, జూలై 27 : వ్యాధుల కాలం ఆరంభమైంది. దీంతో డెంగీ, మలేరియా, చికున్‌గున్యా, డయేరియా, టైఫాయిడ్ రోగులు దవాఖానకు క్యూ కడుతున్నారు. ముందస్తుగా పారిశుధ్య చర్యలు చేపట్టకపోవడంతో గ్రామాలు, పట్టణాల్లో పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది. సర్పంచుల పదవీకాలం ముగిసి ప్రత్యేకాధికారుల పాలనలో గ్రామా ల్లో పారిశుధ్యం అటకెక్కింది. ఏ ఇంట చూసినా దగ్గు, జలు బు, జ్వరంతో సతమతమవుతున్న వారే కనిపిస్తున్నారు. కొన్ని రోజులుగా వాతావరణంలో వస్తున్న మార్పులతో చిన్నా, పెద్ద తేడా లేకుండా మంచానపడుతున్నారు. ఫలితంగా ప్రభుత్వ, ప్రైవేట్ అనే తేడా లేకుండా విషజ్యరాలతో దవాఖానల్లో చేరుతున్నారు. వారం రోజులుగా జనరల్ దవాఖానకు వచ్చే రోగు ల సంఖ్య 1,400 నుంచి 2వేల వరకు పెరిగింది. ప్రైవేట్ దవాఖానల్లో కూడా భారీగానే కేసులు నమోదవుతున్నాయి.
జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన వైద్యం అందక జనరల్ దవాఖానను ఆశ్రయిస్తున్న రోగుల సంఖ్య క్ర మంగా పెరుగుతున్నది. ఇక్కడ సాధారణ జ్వరాలు, ఒంటినొప్పులు, ఇతర సమస్యలకు వైద్యం అందిస్తున్నారు. అయితే నిత్యం ఎక్కువ మంది రోగులు వస్తుండడంతో వైద్యులు హడావుడిగా చికిత్స చేస్తూ చేతులు దులుపుకొంటున్నారని రోగులు వాపోతున్నారు. నాడిపట్టి పరీక్షించి రోగితో సమస్య తెలుసుకునే పరిస్థితి లేదని, సాధారణ పరీక్షలు నిర్వహించి మందులు ఇచ్చి పంపుతున్నారని ఆరోపిస్తున్నారు.
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో వర్షకాలం పక్కా ప్రణాళిక కొరవడుతోంది. పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో రోగుల తాకిడికి అనుగుణంగా సేవలందడం లేదు. వాన నీరు నిలిచి పొంగిపొర్లకుండా చూడాల్సిన మున్సిపాలిటీ వారు మొక్కుబడి చర్యలతో సరిపెడుతున్నారు. పారిశుధ్యం, దోమల నివారణకు ఏటా సీజన్లో రూ.3కోట్ల మేర ఖర్చు పెడుతున్నా ఫలితం లేకుండాపోతున్నది. జిల్లా కేంద్రంలో కనీసం ఫాగింగ్ మిషన్లు కూడా ఉపయోగించడం లేదు. వర్షాకాలం నేపథ్యం లో వ్యాధుల నియంత్రణకు అవగాహన కార్యక్రమాలు, వైద్య శిబిరాలు నిర్వహించాల్సి ఉండగా, ఆ దిశగా ఆరోగ్య శాఖ చ ర్యలు చేపటమ్టడం లేదు. పట్టణంలో నిత్యం లక్ష మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుండగా, సేకరించడంలో జాప్యం తో వ్యాధులు ప్రబలడానికి కారణమవుతోంది.
ఈ ఏడాది జనవరి నుంచి జూలై 21 వరకు 3వేల మందికి డెంగీ పరీక్షలు చేయగా 124 మందికి పాజిటివ్ వచ్చింది. ఇం దులో ఆరోగ్యశాఖ పరిధిలో 57 రాగా, జనరల్ దవాఖానలో 67 కేసులు నమోదయ్యాయి. గతేడాదితో పోలిస్తే ఈ సారి డెంగీ కేసులు పెరిగాయి.
వాతావరణ మార్పులతో ఒక్కసారిగా రోగుల తాకిడి పెరిగింది. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల రోగాల బారిన పడకుండా చూసుకోవచ్చు. ఆహార పదార్థాలపై ఈగలు, దోమలు వాలకుండా చూసుకోవాలి. ఇంటి పరిసరాల్లో వర్షపు నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలి. దోమలు, ఈగలు వృద్ధి చెందకుండా చూడాలి.
– డాక్టర్ బాల శ్రీనివాస్, జనరల్ ఫిజీషియన్, జనరల్ దవాఖాన మహబూబ్‌నగర్