తుంగభద్రకు గర్భశోకం
తుంగభద్ర నదిని ఇసుక అక్రమార్కులు తోడేస్తున్నారు. ఇది తెలిసిన మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తుండడంతో జోగుళాంబ గద్వాల జిల్లాలో వారి వ్యాపా రం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది. అ లంపూర్ నియోజకవర్గంలోని రాజోళి మండలం సుంకేసుల నుంచి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుఅదుపు లేకుండా పోయింది.
- సుంకేసుల డ్యాం నుంచి జోరుగా ఇసుక అక్రమ రవాణా
- ప్రాజెక్టు ఉనికికే ప్రమాదం
- రాత్రి, పగలు తేడా లేకుండా..
- డంపులు చేసి యథేచ్ఛగా దందా
- ధనార్జనే ధ్యేయంగా వ్యాపారం
- పట్టించుకోని అధికారులు
గద్వాల, మే 14 : తుంగభద్ర నదిని ఇసుక అక్రమార్కులు తోడేస్తున్నారు. ఇది తెలిసిన మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తుండడంతో జోగుళాంబ గద్వాల జిల్లాలో వారి వ్యాపా రం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది. అ లంపూర్ నియోజకవర్గంలోని రాజోళి మండలం సుంకేసుల నుంచి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుఅదుపు లేకుండా పోయింది. రాత్రికి రాత్రే ఇసుకను తరలిస్తున్నా మాఫి యా, ఇసుక తవ్వకాలతో డ్యాం ఉనికికి ప్రమాదం పొంచి ఉన్నా ఇది ఇసుక అక్రమార్కులు పట్టడ ం లేదు. ధనార్జనే ధ్యేయంగా వారు తమ దందాను కొనసాగిస్తున్నారు.
ఇసుక అక్ర మ రవా ణా అధికారపార్టీ నా యకులు, అధికారులకు కాసుల వర్షం కురిపిస్తుండగా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతుంది. గత కొ న్ని రోజులుగా సుంకేసుల డ్యాం, పరిసర ప్రాంతాల నుంచి మినీ టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా ఆపే వారు లేరు. పోలీస్ స్టేషన్ ఎదురుగా రోజుకు పదుల సంఖ్యల్లో టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా ఇసుక సరఫరా చేస్తున్నా చర్యలు మాత్రం శూన్యం. దీంతో అధికార యంత్రాంగంపై తీవ్రమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రాత్రిళ్లు జోరుగా ఇసుక అక్రమ రవాణా
సూర్యాస్తమయం అయిందంటే చాలు తుంగభద్ర నదిలో ఇసుక తవ్వకాలు మొదలవుతాయి. ఇసుక తవ్వకాలు మొదలైనా వెంటనే 9గంటల సమయంలో ట్రాక్టర్లు నదిలోకి వెళ్తా యి. అక్కడ నుంచి ఇసుకను తీసుకొచ్చి ఒడ్డున డంప్ చేయ గా వెంటనే 10గంటల తర్వాత టిప్పర్లు రయ్ రయ్ మంటూ అక్కడికి చేరుకుంటాయి. రాత్రి 10 గంటలు మొదలుకొని సూర్యోదయం వరకు పదుల సంఖ్యలో టిప్పర్ల ద్వారా,ట్రాక్టర్ల ద్వారా ఇసుక రవాణాను అలంపూర్ నియోజకవర్గంలోని మండలాల్లో అవసరమైన వారికి ఇసుక సరఫరా చేస్తూ అక్కడి ఇసుక మాఫియా లక్షలు సంపాదిస్తున్నారు.
రాత్రి వేళల్లో ఇసుక టిప్పర్లు, ట్రాక్టర్ల శబ్దానికి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఇక్కడ ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాకు మైనింగ్, రెవెన్యూ అధికారులు అనుమతులు అవసరం లేదు. అక్కడి అధికార పార్టీ నేతకు ముడుపులు చెల్లిస్తే చాలు ఏ అధికారి వారి వాహానాలు ఆపే ప్రయత్నం చేయరు. ఒక వేళ ఏ అధికారైనా ఆపడానికి ప్రయత్నిస్తే ఆ అధికారికి నేరుగా ఆ నేత నుంచి ఫోన్ వెళ్లడంతో అధికారులు తమకేమిపట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు మూట గట్టుకుంటున్నారు.
దీంతో యథేచ్ఛగా నది నుంచి అక్రమ ఇసుక రవాణా సాగుతుంది. రాత్రి అయిందంటే ఇసుక అక్రమ రవాణాకు దారులు తెరుచుకుంటున్నాయి. ఇసుక అక్రమ రవా ణా దందాకు మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ అనుమతులు లేకుండా సాగుతున్న ఈ దందా వల్ల ప్రభు త్వ ఆదాయానికి భారీగా గండి పడుతుంది. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి ఇసుక అక్రమ రవాణా చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

