మహబూబ్‌నగర్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను రాజకీయ ంగా ఎదుర్కోలేక ఆయనపై ఆయన కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు బనాయించే కుట్ర జరుగుతున్నదని శాసనమండలిలో బీఆర్ఎస్ పక్షనేత, మాజీ స్పీక ర్ మధుసూదనాచారి ధ్వజమెత్తారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మ ంత్రితోపాటు ఆయన తమ్ముడిపై పార్టీ నేతలపై పెట్టిన అక్రమ కేసులను ఆయన తీవ్రంగా ఖండించారు. దివ్యాంగులను నిరాశ్రయులను చేసి అర్ధరాత్రి అపరాత్రి అని చూడకుండా వారిని బయటికి పంపించి వా రి ఇల్లు కూలగొట్టడం అనేది నికృష్టమైన చర్య అంటూ విరుచుకుపడ్డారు.
చరిత్రలో ఏ ప్రభుత్వం ఇంతటి పాపానికి పాల్పడలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పాపాన్ని మూటగట్టుకున్నదని విమర్శించారు. దివ్యాంగులకు అండగా ఉన్నందుకు మాజీ మంత్రి తమ్ముడు శ్రీకాంత్‌గౌడ్‌పై తప్పుడు కేసులు బనాయించడం దుర్మార్గమైన చర్య అన్నారు. పత్రాలు సరిగా లేవని సృష్టించారని చెబుతూ కేసులు పెట్టారని.. బీఆర్ఎస్ హయాంలో ఆయన ఒక హోదాలో ఉన్న మంత్రి.. ప్రభుత్వం 58 జీవోను తీసుకుకొచ్చింది అవసరమనుకుంటే సవరించి వాళ్లందరికీ న్యాయం చేసేవాడు ఇలా తప్పుడు పనులు ఎందుకు చేస్తారని ప్రశ్నించారు.
ఇదంతా శ్రీనివాస్‌గౌడ్‌ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక ఇలాంటి కుటిల చర్యలకు పాల్పడుతుందని, ఇది రాజకీయ ప్రేరేపిత కుట్ర అంటూ మం డిపడ్డారు. ఉన్నత ఉద్యోగాన్ని వదిలిపెట్టి తెలంగాణ ప్రజల ఆర్థనాదాలు విని ఉద్యోగ సంఘం నేతగా ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేసిన ఘనత శ్రీనివాస్‌గౌడ్‌ది అన్నారు. ఆయన త్యాగాన్ని ధైర్యాన్ని మనమంతా అభినందించి తీరాల్సిందేనని అన్నారు. రాజకీయ పరిణితిలేని త్యాగానికి అర్థం తెలియని వారు ఇవాళ బీఆర్ఎస్పై ఇతర నేతలపై అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
శ్రీనివాస్‌గౌడ్ కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేస్తే పబ్బం గడుపుకోవచ్చని ఆలోచనతో ఇలాంటి కుట్రలకు తెర లేపుతున్నారని దీ న్ని సహించేది లేదని హెచ్చరించారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై ఎక్కడ ఎలాంటి కుట్రలు జరిగినా అది తెలంగాణ వాదం పై జరిగిన దాడిగా భావించి దీన్ని దీటుగా ప్రతిఘటిస్తామన్నారు. అన్యాయాన్ని ప్రశ్నించినందుకు శ్రీకాంత్‌గౌడ్‌పై కేసులు పెట్టారు.. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు వరద భాస్కర్‌పై కేసు పెట్టి కొట్టారు.. ఇది ఎక్కడి దుర్మార్గమని ప్రశ్నించారు. సోషల్ మీడియా ఇప్పుడున్న మీడియాలో ప్రజలు స్వేచ్ఛగా తమ అభిప్రాయాన్ని వెల్లడించే వేదికగా మా రిందని ఇందులో భాగంగానే అన్యాయాలు అక్రమాలను ప్రజలకు తెలియాలని ఉద్దేశంతో పోస్టులు పెడితే వారిపై కేసులు పెట్టడం చిత్రహింసలకు గురిచేయడం ఇదెక్కడి సంస్కృతి అంటూ నిలదీశారు.
అక్రమ కేసు లు ఎందుకు పెట్టారు అంటూ అడగడానికి వచ్చిన వా రందరిపై కూడా కేసులు పెట్టడం దుర్మార్గపు చర్య అన్నారు. కేసీఆర్ హయాంలో హైదరాబాద్‌ను అమెరికాతో పోటీపడే విధంగా తీర్చిదిద్దామని అదేరకంగా హైదరాబాద్‌తో పోటీపడే విధంగా మహబూబ్‌నగర్ అభివృద్ధిని శ్రీనివాస్‌గౌడ్ చేసి చూపించారని, వీటిని జీర్ణించుకోలేక రాజకీయంగా ఎదుర్కోలేక అక్రమ కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం, పదేండ్లు మేము అధికారంలో ఉన్నాం. తెలంగాణను తీసుకొచ్చాం.. రా ష్ట్ర సర్వోత్తమ అభివృద్ధికి ఎంతో కృషి చేశామన్నారు.
ఎన్నికల్లో మాయమాటలు చెప్పి ఇంకా ఏదో ఒకటి ఎక్కువ ఇస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పదినెలల్లో అసలు స్వరూపం తేలిపోయిందన్నారు. ప్రజలే మా జీవితకాలంలో ఇటువంటి దుర్మార్గపు ప్రభుత్వాన్ని చూడలేదని అంటున్నారంటే మీ పాలన ఎలా ఉందో అర్థవుతుందన్నారు. రాజకీయా ల్లో పట్టుమని పది నెలల్లో ఇంత వ్యతిరేకత వచ్చిన ప్రభుత్వాన్ని నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూ డలేదన్నారు.
ఎన్నికలప్పుడు మాత్రమే ప్రభుత్వంపై సానుకూలత వ్యతిరేకత కనిపిస్తుందని అలాంటిది ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైనట్లు తేటతెల్లమైందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుందా అనే విషయాన్ని భూతద్దంలో కాదు కదా టెలిస్కోప్ పెట్టి వెతికినా కనబడని పరిస్థితి ఉందని ఎద్దేవా చేశా రు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తన అరాచకాలకు ఫుల్స్టాప్ పెట్టకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తనపై తన కుటుంబ సభ్యులతోపాటు పార్టీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టినంత మాత్రానా భయపడేది లేదని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. హన్వాడ మండల కేంద్రంలో 60, 70 మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టేందుకు జాబితాలు సిద్ధం చేసినట్టు తెలిసిందని ఏ ఒక్కరూ భయపడవద్దని మీకు అండగా మేమున్నామని భరోసా ఇచ్చారు. వరద భాస్కర్ ఇంటికి పోతే అతనిని పోలీస్ వాళ్లు కొట్టారని బాధపడితే అడుగుదామని పోతే సీఐ లేరంటే కింద కూర్చున్నాం.. దానికి కూడా కేసు నమోదు చేసారా అంటూ ప్రశ్నించారు.
కూలగొట్టిన దివ్యాంగుల ఇండ్లను కట్టివ్వమని కోరినం అదికూడా తప్పా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. అప్పన్నపల్లి బ్రిడ్జి నిర్మాణం రెండేండ్లలో పూర్తి చేశాం, పేదలకు మెరుగైన వైద్యం అందించాలని పెద్ద దవాఖాన నిర్మాణం చేశాం. వీటిపై అసత్య ప్రచారాలతో ఎన్నికల్లో ఓడించారు. ఇప్పటికీ అదే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా.. పేదల పక్షాన అడుగుతున్న వారిపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమాల్లో అనేక కేసులు నమోదు చేసినా జంకలేదు.
ఇప్పుడు మీరు పెట్టే కేసులకు బెదిరిపోతామా.. మీ బండారాన్ని బయటపెట్టేందుకు ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజలకు వివరిస్తామన్నారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని అధికారులు, పోలీసులు కూడా గుర్తెరిగి ప్రవర్తించాలని ఈ సందర్భంగా ఆయన హితవు పలికారు. సమావేశంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవి, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, గ్రంథాలయాల సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, నాయకులు శివరాజ్, మల్లు నర్సింహారెడ్డి, ఆంజనేయులు, దేవేందర్‌రెడ్డి, రాజేశ్వర్‌రెడ్డి, జంబులయ్య, రాఘవేందర్, నవకాంత్, అహ్మదుద్దీన్, ఇమ్రాన్, పాల సతీశ్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ నేతలు పెట్టిన అక్రమ కేసుల కు రిమాండ్‌లో ఉన్న బీఆర్ఎస్ నేత శ్రీకాంత్‌గౌడ్‌ను శుక్రవారం శాసనమండలిలో బీఆర్ఎస్ పక్షనేత, మాజీ స్పీకర్ మధుసూదనాచారి ములాఖత్ అయ్యి పరామర్శించారు. మహబూబ్‌నగర్‌లో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు 19 మందిపై కాంగ్రెస్ ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసుల విషయాన్ని తెలుసుకొని శుక్రవారం పాలమూరు కు వచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సోదరుడు శ్రీకాంత్‌గౌడ్‌ను గ్రంథాలయ మాజీ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, రైతు సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు మల్లు నర్సింహారెడ్డితో కలిసి పరామర్శించారు.
అయిజ, నవంబర్ 1 : కర్ణాటకలోని కురుస్తున్న వర్షాలకు కృష్ణా, తుంగభద్ర నదులకు వరద కొనసాగుతున్నది. శుక్రవారం జూరాల డ్యాంకు 25,800 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా.. అవుట్‌ఫ్లో 25,231 క్యూసెక్కులుగా నమోదైంది. ఆల్మట్టి డ్యాంకు ఇన్‌ఫ్లో 18,478 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 18,478 క్యూసెక్కులు, నారాయణపూర్ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 16,972 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 17,344 క్యూసెక్కులు, టీబీ డ్యాంకు ఇన్‌ఫ్లో 11,243 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 11,620 క్యూసెక్కులు, ఆర్డీఎస్ ఆనకట్టకు ఇన్‌ఫ్లో 13,787 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 13,100 క్యూసెక్కులు వచ్చి చేరింది.