Wanaparthy | వనపర్తి ఆర్టీసీ డిపో లాభాల బాట పట్టింది. డీఎంగా పరమేశ్వరి బాధ్యతలు చేపట్టాక నష్టాల్లో ఉన్న డిపోకు ఆదాయం వచ్చేలా చర్యలు చేపట్టారు. మొత్తం 65 డిపార్ట్మెంట్, 48 హైర్ బస్సులు ఉండగా.. 138 మంది డ్రైవర్లు, 198 మంది కండక్టర్లు విధులు నిర్వహిస్తున్నారు. డిపోలో పలు మార్పులు, చేర్పులతోపాటు వినూత్న కార్యక్రమాలను చేపట్టారు. నిత్యం ప్రజలకు బస్సు ప్రయాణం సురక్షితమని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సిబ్బందితో కలిసిమెలిసి టార్గెట్లను నిర్ధేశించుకొని అడుగులు వేస్తున్నారు. రూ.17 కోట్ల మేర గతేడాది లాస్ కవరైంది. దీంతో ఉమ్మడి జిల్లాలోని 10 డిపోల్లో రెండో స్థానంలో నిలిచి మిగతా వాటికి
ఆదర్శంగా నిలిచింది.
వనపర్తి, మార్చి 4 : ‘ఆర్టీసీ బస్సులో ప్రయాణం సు రక్షితం’ ‘గమ్యస్థానాలను చేర్చడమే మా విధి’ అంటూ బస్సుల్లో రాసి ఉంటుంది. ఆర్టీసీ యాజమాన్యం ప్రయాణికులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించి నా.. చాలా మంది ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నా రు. నైపుణ్యం లేని డ్రైవర్లు ప్రైవేట్ వాహనాలు నడుపుతుడడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇందులో చాలా మంది ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు క్షతగాత్రులుగా మిగులుతున్నారు.
ఈ క్రమంలో ప్రయాణికులను బస్సుల్లో ప్రయాణించేలా ఆర్టీసీ డీఎంలు అవగాహన కల్పిస్తున్నారు. వనపర్తి డీఎంగా పరమేశ్వరి సెప్టెంబర్ 2022లో పదవీ బాధ్యతలు చేపట్టింది. అప్పటినుంచి లాస్లో ఉన్న ఆర్టీసీకి ఆదాయం పెంచేలా ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్నారు. సిబ్బందితో కలిసిమెలిసి టార్గెట్లను చేరుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. గతేడాది రూ.20.58 కోట్ల లాస్లో ఉన్న డిపోను ఈ ఏడాది రూ.3.11 కోట్లు మాత్రమే ఉండేలా చేశారు.
అంటే దాదాపుగా రూ.17 కోట్ల మేర లాస్ కవర్ చేస్తూ.. ఉమ్మడి జిల్లాలోని 10 డిపోల్లో వనపర్తిని రెండో స్థానంలో నిలిచేలా చేసింది. డిపోకు ఆదాయం పెంచేందుకు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. వనపర్తి ఆర్టీసీ డిపోలో 113 బస్సులు ఉండగా.. అందులో 65 ఆర్టీసీ, 48 హైర్ బస్సులు ఉన్నాయి. 138 మంది డ్రైవర్లు, 198 మంది కండెక్టర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. 102 బస్సులు ఆయా రూట్లలో ఉండగా.. రోజుకు మూడు బస్సుల చొప్పున గ్యారేజ్‌లో రిపేర్లు చేయిస్తున్నారు. అంతా కండీషన్లో ఉన్న తరువాతే రూట్‌కు పంపిస్తున్నారు.
డ్రైవర్లు, కండెక్టర్ల సహకారంతోనే డిపో పరిధిలోని లాస్‌ను కవర్చేయగలిగాం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 10 డిపోల్లో లాస్ కవర్ చేయడంలో మొదటిదిగా మహబూబ్ నగర్, రెండో స్థానంలో వనపర్తి డిపోలు నిలిచాయి. ప్రధానంగా ప్రయాణికులు ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించేలా చేయడం, రోజు వారీగా టార్గెట్లను నిర్దేశిం చుకుని పని చేయడం వల్లే ఇది సాధ్యమైంది. లాస్కవర్ చేయడంలో కృషి చేస్తున్న ఆర్టీసీ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు.
– పరమేశ్వరి, ఆర్టీసీ డిపో మేనేజర్, వనపర్తి