వనపర్తి, ఏప్రిల్ 22(నమస్తే తెలంగాణ) : కాళేశ్వరంపై హైకోర్టు తీర్పుతోనైనా కాంగ్రెస్‌కు బుద్ధి రావాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం లేదని వెలువడిన తీ ర్పుపై సింగిరెడ్డి బుధవారం ప్రకటనలో హ ర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ జీవనాధార కాళేశ్వరంపై నిందలు మోపి బీఆర్ఎస్, కేసీఆర్‌ల ప్రతిష్టను దెబ్బ తీసేందుకు కాంగ్రెస్, బీజేపీలు చేసిన కుట్రలు పటాపంచలయ్యాయన్నారు. రెండున్నరేళ్లు మరమ్మతులు చే పట్టకుండా కుట్రతోనే అడ్డుకున్నారని, చివరకు గత్యంతరం లేక మరమ్మతులకు సిద్ధమయ్యారన్నారు.
కాళేశ్వరం విషయంలో కేసీఆర్‌పై చేసిన ఆరోపణలకు కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణ ప్రజలకు, రైతాంగానికి క్షమాపణలు చె ప్పాలని నిరంజన్‌రెడ్డి డిమాండ్ చేశారు. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టుపై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వా గతిస్తున్నామని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి న ఈ రెండున్నరేళ్లలో కేవలం అబద్ధపు ప్రచారాలతోనే కాలయాపన చేశారన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతున్నప్పుడల్లా అవినీతి పేరుతో అబద్ధాలను వళ్లించారని, ఇక నుంచైనా హైకోర్టు తీర్పు తో కనువిప్పు కలగాలని, బీఆర్ఎస్పై బు రద చల్లడం మానుకోవాలని నిరంజన్‌రెడ్డి హితవు పలికారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత ప్రయోజనం ఒనగూర్చుతుందని, రాజకీయాల పేరుతో పదే..పదే అబద్ధాలతో ఉన్న సమయాన్ని కూడా వృ థా చేయవద్దని సింగిరెడ్డి పేర్కొన్నారు.
జడ్చర్లటౌన్, ఏప్రిల్ 22 : కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ నివేదికకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మారెడి పేర్కొన్నారు. తెలంగాణను సస్యశ్యామలం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీజేపీలు అడ్డగోలుగా విమర్శలు చేసి రాజకీయ లబ్ధి కోసం కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతిసేందుకు కుట్ర పన్నారని మండిపడ్డారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎటువంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించటంతో న్యాయం గెలిచిందన్నారు.
కాంగ్రెస్, బీజేపీలు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్ని అబద్ధాలను ప్రచారం చేశాయని, న్యాయస్థానాలపై నమ్మకంతో కేసీఆర్, హరీశ్‌రావు పోరాడారని, చివరకు నిజమే గెలిచిందన్నారు. కాంగ్రెస్, బీజేపీల అబద్ధపు, అసత్య ప్రచారాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని, రానున్న కాలంలో ప్రజలు కూడా ఆ పార్టీలకు తగిన బుద్ధి చెబుతారన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ రాజకీయ కక్ష్యలు, వేధింపులను మానుకోవాలని హితవుపలికారు. పాలనపై దృష్టిసారించి ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను నేరవేర్చాలని సూచించారు. కాంగ్రెస్, బీజేపీలకు హైకోర్టు తీర్పుతోనైనా కనువిప్పు కలగాలని ఆకాంక్షించారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదికకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మాజీ మంత్రి హర్షం వ్యక్తం చేశారు.
అలంపూర్, ఏప్రిల్ 22 : కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు తీర్పు తెలంగాణ ప్రజల విజమయని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు బుధవారం ప్రకటనలో పేర్కొన్నారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎటువంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించటంతో న్యాయం గెలిచిందన్నారు. 2025 జూలైలో ప్రభుత్వం సమర్పించిన రిపోర్టు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమేనని సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీపై బురద జల్లె ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. ఉద్దేశ పూర్వకంగానే కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీపై అసత్య ఆరోపణలు చేస్తుందని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుతారని, నిజాలు నిదానంగా తెలుతాయన్నారు.