అయిజ, జూలై 31 : కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో తుంగభద్ర డ్యాంకు ఇన్ఫ్లో నిలకడగా కొనసాగుతున్నది. శుక్రవారం టీబీ డ్యాంకు ఇన్ ఫ్లో 16,050 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 3,629 క్యూసెక్కులు నమోదైంది. కర్ణాటక, ఏపీ రాష్ర్టాల తాగునీటి అవసరాల కోసం కాల్వల ద్వారా 3,630 క్యూసెక్కులు విడుదల చేస్తున్నా రు.
డ్యాం గరిష్ఠ నీటి మట్టం1633 అడుగులకు గానూ ప్రస్తుతం 1609.74 అడుగుల నీటిమట్టం ఉన్నది. అలాగే 105.788 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి గానూ ప్రస్తుతం 37.063 టీఎంసీల నీటి నిల్వ ఉందని డ్యాం సెక్షన్ అధికారి కిరణ్కుమార్ తెలిపారు.