గుండె నొప్పితో వస్తే… ఎస్వీఎస్కు పంపారు..
‘మహబూబ్‌నగర్ జిల్లా దవాఖానలో ఇటీవల దేవరకద్ర మండలం ముచ్చింతల గ్రామానికి చెందిన కొండమ్మ గుండె నొప్పితో అర్ధరాత్రి మహబూబ్‌నగర్ జిల్లా దవాఖానకు వచ్చింది. వచ్చి రాగానే ట్రీట్మెంట్ చేయాల్సిన సిబ్బంది డాక్టర్లు లేరని వెంటనే ప్రైవేట్ దవాఖానకి వెళ్లాలని సూచించారు. కనీసం ప్రాథమిక చికిత్స కూడా చేయకుండా లోపలికి వచ్చిన పేషెంట్‌ను బయటికి పంపించారు. ప్రాణభయంతో ఆ రాత్రి ప్రైవేట్ అంబులెన్స్‌లో జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ దవాఖానకు తరలిస్తే అప్పటికే కాంటాక్ట్‌లో ఉన్న డాక్టర్లు పేషెంట్‌కు డబ్బులు కట్టమని డిమాండ్ చేశారు.
రాత్రి అయ్యింది డబ్బులు మా చేతిలో లేవు మళ్లీ ఊరికి వెళ్లాలి. రేపు ఉదయం తీసుకొస్తాం అన్న ప్రైవేట్ దవాఖాన సిబ్బంది కనికరించలేదు. దీంతో మళ్లీ హుటాహుటిన హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. అక్కడపరిశీలించిన డాక్టర్లు కనీసం ప్రథమ చికిత్స ఎందుకు చేయలేదనిమీరు అడగలేదా? అంటూ బంధువులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ లోపు ట్రీట్మెంట్ ప్రారంభించిన ఫలితం కనబడినట్టే కనబడి మూడు రోజుల తర్వాత ఆమె చనిపోయింది. మహబూబ్‌నగర్ ప్రభుత్వ దవాఖాన నిర్లక్ష్యమే కారణం అని తెలిసినా ఏ ఒక్కరిపై చర్యలు లేవు’.
..ఇలాంటి ఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నఇక్కడి సూపరింటెండెంట్, ఆర్ఎంవో తమ పదవులను కాపాడుకునేందుకు డాక్టర్లు సిబ్బందిపై పెత్తనం చెలాయించేందుకు మాత్రమే పని చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వ స్పందించి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రభుత్వ దవాఖానలో పనితీరును మెరుగుపర్చాలని లేకపోతే పేద రోగులకు అన్యాయం జరుగుతుంది అని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
మహబూబ్‌నగర్, మే 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి పాలమూరు జిల్లాలో సర్కారు వైద్యం పేదలకు అందని ద్రాక్షగా మారింది. సర్కారు దవాఖానలు ఉన్నాయని ధైర్యంతో వస్తే ఇక్క డి డాక్టర్లు ప్రైవేట్ దవాఖానలకు రెఫర్ చేస్తున్నారు. కేవలం అవుట్ పేషంట్స్‌కు దగ్గు, జలుబు, చిన్నచిన్న వాటికి ట్రీట్మెంట్ ఇస్తూ మమ అనిపిస్తున్నారు. ఎమర్జెన్సీ కేసులు వస్తే హుటాహుటిన ప్రైవేట్ దవాఖానకో లేదా హైదరాబాద్‌కో రెఫర్ చేసి చేతులు దు లుపుకొంటున్నారు.
ఇక ఏ టెస్ట్ కావాలన్నా బయటికి పోవాల్సిందే. మందుల కొరత అంటూ చిట్టీలు రాసి పంపిస్తున్నారు. బయట ఉన్న జనరిక్ మందుల షాప్‌కు వెళితే ఈ మందులు లేవంటూ బయటికి పంపిస్తున్నారు. ఇక జిల్లా దవాఖానలో సి బ్బందిదే హవా నడుస్తోంది. డబ్బులు ఉంటేనే బెడ్ దొరికే పరిస్థితి నెలకొన్నది. ఇక టెస్టులు చేయడానికి కూడా వెనుకాముందు అవుతున్నారు. ఏవో సాకులు చెప్పి టెస్టులన్నింటికీ బయటికే పంపిస్తున్నారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని అన్ని జిల్లా కేంద్రాల్లోని దవాఖానలను బుధవారం ‘నమస్తే తెలంగాణ’ బృం దం పరిశీలించింది. ఈ సందర్భంగా అనేక విస్తుపోయే విషయా లు బయటపడ్డాయి. సాక్షాత్తు సీఎం సొంత జిల్లాలోనే ఈ పరిస్థితి నెలకొన్నది. జిల్లా ఉన్నతాధికారులు తనిఖీలు నిర్వహించినా సిబ్బంది పనితీరు మాత్రం మారలేదన్న ఆరోపణులు ఉన్నాయి.
పాలమూరు దవాఖానలో ప్రైవేట్ దందా..
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో ప్రైవేట్ దందా సాఫీగా నడుస్తున్నది. ఇక్కడి డాక్టర్లు సిబ్బంది తమకు అనుకూలమున్న ప్రైవేట్ దవాఖానలకు రెఫర్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. క్రిటికల్ కేసులు వస్తే ఏకంగా హైదరాబాద్‌కు పంపించి చేతులు దులుపుకుంటున్నారు. తమ కుటుంబ సభ్యులను రక్షించుకోవాలని తాపత్రయంతో జనం డాక్టర్ల మాయలో పడిపోతున్నారు. మహబూబ్‌నగర్ ప్రభుత్వ దవాఖాన ముందు అటు ఇటు ప్రైవేట్ అంబులెన్స్‌లే ఇందుకు నిదర్శనం. దవాఖాన సిబ్బంది కుమ్మకై రోగులను సీరియస్ ఉందని చెబుతూ వెనువెంటనే అంబులెన్స్‌లను రప్పిస్తూ డబ్బులతో పీల్చుకుతింటున్నారు. తొందరగా తీసుకెళ్తే బతుకుతాడని చెప్పి అంబులెన్సుల్లో ఇష్టారీతిగా డబ్బులు వసూలు చేసి కమిషన్లు దండుకుంటున్నారు.
ప్రభుత్వ అంబులెన్సులు ఏవీ!?
గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మహబూబ్‌నగర్ ప్రభుత్వ జిల్లా దవాఖానకు ప్రత్యేకంగా అన్ని హంగులతో కూడిన 5 అంబులెన్స్‌లు కేటాయించారు. దీనికి తోడు గిఫ్ట్ స్మైల్ కింద అప్పటి మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, మహబూబ్‌నగర్ ఎంపీ మన్నే శ్రీనివాస్‌రెడ్డిలు పేదలకు అందుబాటులో ఉండాలని ఉద్దేశంతో అంబులెన్స్‌లు కేటాయించారు. అయితే ఈ అంబులెన్స్‌లన్నీ ప్రభుత్వ దవాఖానలో మూలన పడేశారు. నిర్వహణ లేక కాదు ప్రైవేట్ అంబులెన్స్‌ల దందాలను ప్రోత్సహించాలని ఉద్దేశంతో వీటిని వాడడం లేదు. ఇక డాక్టర్లు వచ్చిన కేసులన్నీ జిల్లా కేంద్రంలోని ప్రముఖ ప్రైవేట్ దవాఖానకు.. లేదా హైదరాబాద్ దవాఖానలకు రెఫర్ చేస్తూ కమీషన్లు దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఉమ్మడి జిల్లాలో కూడా ఇదే పరిస్థితి..
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని జోగుళాంబ గద్వాల, నాగర్‌కర్నూల్, నారాయణపేట జిల్లా దవాఖానల పనితీరు కూడా ఇదేవిధంగా ఉంది. ఆయా జిల్లా వైద్య శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రభుత్వం ఏటా విలువైన మందులు ఇతర సౌకర్యాలను కల్పిస్తున్నప్పటికీ అవన్నీ మాయమవుతున్నాయి. దవాఖానలో ఇన్ పేషెంట్‌గా చేరిన వారికి కూడా ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా ఇబ్బందులు పెడుతున్నారు.
కాన్పు కోసం వచ్చిన మహిళలను నాన మాటలు అంటూ మానసికంగా ఇబ్బందులు పెడుతున్నారు. ఇటీవల మహబూబ్‌నగర్ దవాఖానలో వైద్యం కోసం వచ్చిన ఓ మహిళ సిబ్బంది మాట తీరుతో దవాఖానలోని బాత్రూంలో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనను రోగి బంధువుల మీదికే నెట్టి చేతులు దులుపుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లా కేంద్రంలో అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉన్నా ప్రభుత్వ దవాఖాన తీరు మాత్రం మారడం లేదు. నారాయణపేట జిల్లా దవాఖాన పరిస్థితి కూడా